• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: పలాస మండలం లొద్దభద్ర గ్రామంలో శనివారం జరిగిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఆమె అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత పాలకులు పట్టాదారు పుస్తకాలపై వారి వ్యక్తిగత ఫోటోలను ముద్రించిన విషయాన్ని గుర్తు చేశారు.

April 4, 2026 / 05:46 PM IST

‘నీటి సంరక్షణకు ప్ర‌త్యేక 100 రోజుల‌ ఉత్సవం’

VZM: రాష్ట్రంలో భూగర్భ, ఉప‌రిత‌ల జల మట్టాలను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర‌ ప్రభుత్వం “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే పేరుతో 100 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ బృహత్త‌ర కార్య‌క్ర‌మం ఏప్రిల్ 6, 2026 నుంచి జూలై 14, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమ‌లు కానుందన్నారు.

April 4, 2026 / 05:45 PM IST

ఈగల్ టీం, పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు

ఏలూరు పట్టణ పరిధిలో ఉన్న వివిధ దుకాణాలలో ఇవాళ పోలీసులు, ఈగల్ టీం సిబ్బంది విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్‌లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. స్కూల్లు, కాలేజీల వద్ద పొగాకు ఉత్పత్తులు పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుకాణదారులకు హెచ్చరించారు.

April 4, 2026 / 05:45 PM IST

కుందుర్పి గ్రామంలో తాగునీటి సమస్య

ATP: కుందుర్పి మండలం ఎన్.వెంకటాంపల్లి ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. నీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి ఫిల్టర్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

April 4, 2026 / 05:45 PM IST

విశాఖలో బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ ఆవిర్భావం

విశాఖలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ ఆవిర్భవించిందని ఛైర్మన్ వడ్డాది ఉదయకుమార్ తెలిపారు. శనివారం సుజాతనగర్ ట్రస్ట్ కార్యలయంలో మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక భద్రత లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. అర్చకులు, పురోహితుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని చెప్పారు. సభ్యత్వానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

April 4, 2026 / 05:44 PM IST

‘బీఆర్ నాయుడును తక్షణమే బర్తఫ్ చేయాలి’

KDP: కమలాపురంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నిరసన తెలిపింది. పార్టీ సమన్వయకర్త నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వరస్వామి గుడిలో టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అక్రమ సంబంధాలతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడును ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని నరేన్ డిమాండ్ చేశారు.

April 4, 2026 / 05:40 PM IST

కోలగట్లను పరామర్శించిన ఎమ్మెల్యే

VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోదరుడు తమ్మన్నశెట్టి గత కొద్దిరోజుల క్రితం స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) శనివారం విజయనగరంలోని వారి స్వగృహమందు కోలగట్ల సోదరులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 4, 2026 / 05:33 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసిన జేసీ అశుతోష్

GNTR: వట్టిచెరుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జేసీ తనిఖీ చేశారు. వైద్యం నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు పట్ల ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి సిబ్బంది పనితీరును, శుభ్రత, మంచినీరు, మరుగుదొడ్లు వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర మందులు అందుబాటు ఏ మేరకు ఉన్నాయో తనిఖీ చేశారు.

April 4, 2026 / 05:33 PM IST

‘పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించండి’

KRNL: గ్రామ అభివృద్ధి కోసం ఇంటి, కుళాయి, వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించాలని దేవనకొండ గ్రామ కార్యదర్శి రాముడు యాదవ్ ఇవాళ కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు పన్నుల వసూలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆలస్యం చేయకుండా బకాయిలు వెంటనే చెల్లించి గ్రామ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

April 4, 2026 / 05:30 PM IST

ప్రజల వద్ద నుంచి అర్జీలు సేకరించిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శనివారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

April 4, 2026 / 05:30 PM IST

వినుకొండ పట్టణంలో బడ్జెట్ సమీక్ష సమావేశం

PLD: వినుకొండ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లుగా జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మల్లికార్జునరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై అధికారులతో చర్చించారు.

April 4, 2026 / 05:30 PM IST

‘విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యం’

NDL: మహానంది మండలం తిమ్మాపురంలో ఏపీ మోడల్ స్కూల్లో ఏప్రిల్ 2, 4వ తేదీలలో క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలను ప్రిన్సిపల్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. క్రీడల విభాగంలో విద్యార్థులు శారీరక దృఢత్వాన్ని, క్రీడా స్ఫూర్తిని చాటగా, సాంస్కృతిక  విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని అలరించాయి. శనివారం కార్యక్రమం ముగింపులో పోటీల్లో బహుమతులు అందజేశారు.

April 4, 2026 / 05:30 PM IST

‘గ్యాస్ సరఫరా చేయడంలో ప్రభుత్వాలు విఫలం’

VZM: వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ నెల్లిమర్ల మండల కార్యదర్శి పాపారావు అన్నారు. నెల్లిమర్లలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులు తమ జీవనం గడపడం కష్టతరంగా మారిందని, ఇటు గ్యాస్ దొరక్క అటు కట్టెలు కొనుక్కోలేక అనేక కుటుంబాల్లో పస్తులు ఉంటున్నారన్నారు.

April 4, 2026 / 05:20 PM IST

మహిళ అనుమానాస్పద మృతిపై విచారణ

ఏలూరు రూరల్ మండలం కోమడ వోలు గ్రామంలో వివాహిత ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. అరవల్లి నాగమణి (44) భర్త, పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు నేపథ్యంలోని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రూరల్ ఎస్సై జయ శర్మ ఐపీఎస్ అనుమానాస్పదగా మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 4, 2026 / 05:15 PM IST

‘ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి’

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ఈనెల 10 నుంచి 12 వరకు అనంతపురం జిల్లాలో జరుగుతున్న సీపీఐ, బీకెఎంయూల ఆధ్వర్యంలో పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సీపీఐ నేతలు కోరారు. శనివారం ఏలూరు ప్రజా సంఘాల కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

April 4, 2026 / 05:15 PM IST