• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీడీపీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

TPT: శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్గీయ శ్రీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జయంతి సందర్భంగా ఏప్రిల్ 15న చేపట్టబోయే సేవా కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బొజ్జల జయంతి పోస్టర్‌ను ఆవిష్కరించి, ఆయన ఆశయాల బాటలో ముందుకు నడవాలని సూచించారు.

April 13, 2026 / 09:00 PM IST

రేపల్లె పట్టణలో PGRS కార్యక్రమం

BPT: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించారు. 59 మంది స్వయంగా తమ సమస్యలు ఎస్పీకు విన్నవించుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని చెప్పుకొచ్చారు. గడువులోగా వినతులను పరిష్కరించాలని ఆదేశించారు.

April 13, 2026 / 08:42 PM IST

బాధ్యతాయుతంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

SKLM: పలాస నియోజకవర్గంలోని గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో, పాలనలో ఎటువంటి జాప్యం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు లేని సమయంలో అధికారుల బాధ్యత మరింత పెరుగుతుందని గుర్తు చేశారు. పలాసలో తన కార్యాలయంలో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

April 13, 2026 / 08:40 PM IST

భోగాపురం వరకు మెట్రో పొడిగింపు ప్రతిపాదన

VSP: విశాఖ మెట్రోను భోగాపురం వరకు పొడిగించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. రుషికొండలో టీసీఎస్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నందున మెట్రో అనుసంధానం ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో మొత్తం 76.90 కి.మీ మేర 4 కారిడార్లను ప్రతిపాదించామని తెలిపారు.

April 13, 2026 / 08:40 PM IST

జిల్లా ఎస్పీని కలిసిన నూతన డీఎస్పీలు

EG: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ని సోమవారం ఏ. శివప్రియ, డీ.ఎస్.పీ సౌత్ జోన్, నార్త్ జోన్ డీఎస్పీ జీవన జిల్లా పోలీస్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి రిపోర్ట్ చేశారు. ఎస్పీ డీఎస్పిని అభినందించి, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.

April 13, 2026 / 08:37 PM IST

తాగునీటి పైప్ లైన్ లీకేజీతో వృధాగా పోతున్న నీరు

ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై సత్యసాయి తాగునీటి పైప్లైన్ లీకేజీ కావడంతో త్రాగునీరు వృధాగా పోతున్నాయి. దీంతో రోడ్డు మీద నీరు నిలబడడంతో వాహనాదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవికాలం త్రాగునీరు వృధాగా పోతుండడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 13, 2026 / 08:36 PM IST

అచ్యుతాపురం KGBVని సందర్శించిన ఎమ్మెల్యే

AKP: అచ్యుతాపురం కేజీబీవీ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశించారు. విద్యార్థిని నవ్య మృతి చెందిన నేపథ్యంలో ఇవాళ ఆకస్మికంగా ఎమ్మెల్యే కేజీబీవీని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

April 13, 2026 / 08:35 PM IST

జిల్లా ఎస్పీని కలిసిన నూతన మహిళా పీఎస్ డీఎస్పీ

ప్రకాశం: ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌కు నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పీ. శ్రీధర్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు (ఐపీఎస్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ శుభాకాంక్షలు తెలుపుతూ.. మహిళలు, పిల్లల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

April 13, 2026 / 08:34 PM IST

రైలు కిందపడి మహిళ మృతి

NLR: పడుగుపాడు- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య సుమారు 40-45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మరణించింది. మహిళ పచ్చని చీరపై వంగపూత రంగు చుక్కలు, అంచు కలదు. ఎర్రని జాకెట్, నల్లని లంగా ధరించి ఉంది. మేడలో పూసలతో కూడిన పసుపు దారం, కుడి చేతిపై పచ్చ బొట్టు ఉంది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

April 13, 2026 / 08:30 PM IST

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే

PPM: ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండగా, ముందుగా పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందరూ సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో పురపాలక సంఘ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘంలో 40 వార్డులు ఉండేలా అధిష్టానాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 36 వార్డులు ఉన్నాయని తెలిపారు.

April 13, 2026 / 08:30 PM IST

మే నుంచి ఇళ్ల జాబితా లెక్కింపు.!

NTR: జనగణన-2027లో భాగంగా నందిగామ పట్టణంలో మే 1 నుంచి 31 వరకు ఇళ్ల జాబితా లెక్కింపు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జీ. లోవరాజు తెలిపారు. దీనికి సంబంధించి సూపర్వైజర్‌లు, ఎన్యుమరేటర్‌లకు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. తొలి విడత ఏప్రిల్ 15-17, రెండవ విడత ఏప్రిల్ 20-22 వరకు బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరుగుతుందని వెల్లడించారు.

April 13, 2026 / 08:26 PM IST

ప్రజల సమస్యలను పరిష్కరించిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు (M) తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి వీరాంజనేయస్వామి ప్రజల వినతులు స్వీకరించారు. కొండపి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. అర్జీలను పరిశీలించిన మంత్రి వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

April 13, 2026 / 08:20 PM IST

‘పోషణపక్వాడతో తల్లి–శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం’

VSP: ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ గాజువాకలో ‘పోషణపక్వాడ’ కార్యక్రమాన్ని ప్రారంభించి పోస్టర్లు విడుదల చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణ సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. మొదటి 1000 రోజులు కీలకమని, అంగన్వాడీల ద్వారా అవగాహన పెంచుతున్నామన్నారు.

April 13, 2026 / 08:20 PM IST

సంజీవని ప్రాజెక్టుపై కలెక్టర్ సమీక్షా సమావేశం

చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల PHC స్టాఫ్ నర్సులకు సంజీవని ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపికి వచ్చే ప్రతి పేషెంట్‌ను లాగిన్ల ద్వారా 100% డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. డిజిటల్ నమోదు ద్వారా భవిష్యత్తులో సులభచికిత్స అందించవచ్చని తెలిపారు.

April 13, 2026 / 08:20 PM IST

మెట్టూరులో DCCB బ్యాంకును ఏర్పాటు చేయాలని వినతి

శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్ శివ్వాల సూర్యనారాయణని కొత్తూరు వైస్ ఎంపీపీ లోతుగడ్డ తులసి వరప్రసాద్ సోమవారం కలిశారు. కొత్తూరు మండలం మెట్టూరు DCCB బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ బ్యాంక్ ఎంతో అవసరమని తెలిపారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించిన పేర్కొన్నారు.

April 13, 2026 / 08:20 PM IST