చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల PHC స్టాఫ్ నర్సులకు సంజీవని ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపికి వచ్చే ప్రతి పేషెంట్‌ను లాగిన్ల ద్వారా 100% డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. డిజిటల్ నమోదు ద్వారా భవిష్యత్తులో సులభచికిత్స అందించవచ్చని తెలిపారు.