GNTR: అగ్నిమాపక వారోత్సవాలు 4వ రోజు తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని వెస్ట్‌బెర్రీ స్కూల్‌తో పాటు రవి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్యాస్, ఎలక్ట్రికల్ ఫైర్లు, కేర్లెస్ స్మోకింగ్ ప్రమాదాలపై డెమోలు నిర్వహించారు. విద్యార్థులకు మాక్ డ్రిల్ ద్వారా అగ్నిప్రమాద నివారణపై అవగాహన కల్పించారు.
PLD: అమరావతి మండలంలోని దిడుగు గ్రామం నుంచి ఏటూరు వెళ్లే మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. ఈ విషయంపై ఏప్రిల్ 14న HIT TVలో కథనం ప్రచూరితమైంది. స్పందించిన అధికారులు పంచాయతీ అధికారుల సమక్షంలో రోడ్డు మధ్యలో తీసిన గండిని పూడ్చివేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా లంక భూముల్లో గండ్లు కొడితే చర్యలు తీసుకుంటామని MPDO హెచ్చరించారు.
AKP: రాష్ట్ర హోం మంత్రి అనిత ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు పాయకరావుపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్తగా నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ శుక్రవారం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీహెచ్సీలో కొత్తగా నిర్మించిన అదనపు భవనాలను ప్రారంభిస్తారన్నారు.
VZM: మహిళా రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు.
TPT: సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. చమర్తి కండ్రిగలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం సంఘ మిత్రాలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసి, మహిళా సంఘాల సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
ప్రకాశం: ఇటీవల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి లోకేష్ బాబును ఉండవల్లిలోని తన నివాసంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వారి కుమార్తె భవ్య నందినిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గత వైసీపీ అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న యువగళం పాదయాత్ర గేమ్ చేంజర్‌గా మారి అధికారంలోకి రావడానికి తోడ్పడిందని ఎమ్మెల్యే తెలిపారు.
PLD: ఉండవల్లి నివాసంలో TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి లోకేష్‌ను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని ఆకాంక్షించారు. లోకేష్‌తో మాట్లాడుతూ.. రాజకీయాలపై సర్చించారు.
అన్నమయ్య: ఏపీ రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కంచి కామకోటి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆశీర్వచనం అందుకున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక శక్తి మనిషికి దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కర్నూలు పర్యటనలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తులను ఇవాళ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్ బి. కృష్ణమోహన్, కె. శ్రీనివాస రెడ్డి, ఎ. హరిహర నాథ శర్మలను పూలతో స్వాగతించారు. ఈ సందర్భంగా వారికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి పాల్గొన్నారు.
E.G: కోరుకొండ మండలం బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శుక్రవారం గ్రీవెన్స్ & పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం పార్టీకి మొదటి కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు.
BPT: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాల మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీ-4 సిబ్బంది, నాయకులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 28 అర్జీలు అందగా, వీటిలో ఇంటి నిర్మాణం, స్థలాల కోసం 7, పింఛన్లకు సంబంధించిన 17, ఇతర సమస్యలపై 4 అర్జీలు స్వీకరించారు.
GNTR: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీ.యం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
TPT: చిత్తూరు పట్టణంలో మహిళల భద్రత, పిల్లల రక్షణపై శక్తి టీం, మహిళా పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై వేధింపులు, బాలలపై నేరాలు, సోషల్ మీడియా మోసాలపై అవగాహన కల్పించడంతో పాటు శక్తి యాప్ వినియోగంపై వివరించారు. సుమారు 500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు.
CTR: గుడిపాల పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 3.5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 లక్షల విలువ గల బియ్యంతో పాటు రూ.3 లక్షల విలువైన బొలెరో వాహనాన్ని కూడా పట్టుకున్నారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
KDP: ఒంటిమిట్ట సీఐగా పసుపుల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, రైల్వే కోడూరు, చిట్వేలి, రాజంపేట ప్రాంతాల్లో ఎస్సైగా సేవలు అందించిన ఆయన, రైల్వే కోడూరు రూరల్ సీఐగా కూడా విధులు నిర్వహించారు. ఆయన అనుభవంతో ఒంటిమిట్ట ప్రాంతంలో చట్టవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.