• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మొక్కజొన్న తోటలో సోలార్ ప్యానల్స్ వైర్లు దగ్ధం

VZM: గజపతినగరం మండలంలోని తమ్మారాయిడపేట గ్రామంలో అజాగ్రత్తగా కాల్చిన సిగరెట్‌ను పారి వేయడం వల్ల కోసి వేసిన కోరాడ పైడితల్లి మొక్కజొన్న తోట దగ్ధమైంది. దీంతో పాటు పొలంలో ఉన్న సోలార్ ప్యానల్స్, మోటార్ వైర్లు కాలిపోయాయి. దీనివల్ల సుమారు లక్షన్నర ఆస్తి నష్టం జరిగింది. పక్కనే ఉన్న మొక్కజొన్న తోటకు మంటలు వ్యాపించకుండా స్థానికులు మంటలు అదుపు చేశారు.

April 17, 2026 / 04:12 PM IST

‘మాజీ సైనికుల సభను జయప్రదం చేయాలి’

BPT: ఈ నెల 19న బాపట్లలో జరిగే రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు కోరారు. అన్నం సతీష్ ప్రభాకర్ కళ్యాణ మండపంలో ఈ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, కలెక్టర్ వినోద్ కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పుకొచ్చారు.

April 17, 2026 / 03:54 PM IST

జీవీఎంసీ వార్డుల పునర్విభజనపై వినతి

VSP: జీవీఎంసీ 98 వార్డులను 120గా పునర్విభజించే ప్రక్రియలో రాజకీయ లబ్ధి కోసమే సరిహద్దులు మార్చుతున్నారంటూ 78వ వార్డు మాజీ కార్పొరేటర్ గంగారావు శుక్రవారం చీఫ్ సిటీ ప్లానర్‌ను కలిసి వినతిపత్రం అందజేశాయి. జనాభా ఆధారంగా శాస్త్రీయంగా విభజన చేయాలన్న నిబంధనలు పాటించట్లేదని, కొన్ని చోట్ల కులాల వారీగా మార్పులు చేస్తున్నారని ఆరోపించారు.

April 17, 2026 / 03:51 PM IST

‘మద్దతు ధరల కోసం రైతుల ఆందోళన’

శ్రీకాకుళం జిల్లా రైతు సంఘం సమావేశంలో రైతుల సమస్యలు ప్రధానంగా చర్చించారు. పంటలకు సరైన మద్దతు ధరలు లేక నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ఎరువుల కొరత, అధిక ధరలు, నాసిరకం విత్తనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 20న మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని రైతు సంఘం పిలుపునిచ్చింది.

April 17, 2026 / 03:51 PM IST

కరెంటు కోతలకు చెక్… 300 యూనిట్లు ఉచితం

కోనసీమ: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గుతాయని, నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చన్నారు.

April 17, 2026 / 03:50 PM IST

మహిళా ప్రతినిధులతో ఎమ్మెల్యే శ్రావణి సెల్ఫీ

ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి తోటి మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ నివాసాన్ని సందర్శించారు. అక్కడ వారి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం తోటి మహిళా ప్రతినిధులతో కలిసి సెల్ఫీలు దిగారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో ఢిల్లీలో ఉండటం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

April 17, 2026 / 03:50 PM IST

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన నరసింహులుకు సన్మానం

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన LIC జరిపేటి నరసింహులును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహంలో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు, పొదిలి సుదర్శన్, ఎర్రం శెట్టి రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

April 17, 2026 / 03:50 PM IST

అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్

GNTR: తెనాలి నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక అంశాలపై సమీక్ష చేపట్టారు. ప్రత్యేకాధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించిన మంత్రి, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పారిశుధ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.

April 17, 2026 / 03:45 PM IST

జల్ జీవన్ మిషన్ కమిటీతో కలెక్టర్ సమావేశం

PLD: త్రాగునీరు, పారిశుద్ధ్య మిషన్ (జల్ జీవన్ మిషన్) కమిటీ సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లాస్థాయి, మండల స్థాయి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించారు. వేసవికాలం సమీపించడంతో గ్రామాలలో మంచినీటి కొరత లేకుండా అధికార యంత్రాంగం ముందస్తుగానే తగు చర్యలు తీసుకోవాలన్నారు.

April 17, 2026 / 03:41 PM IST

జీఎస్టీ వసూళ్లలో పురోగతి పెంచాలి: కలెక్టర్

KRNL: కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జీఎస్టీ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డా.ఏ. సిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ వసూళ్ల పురోగతి, పెండింగ్ అంశాలు, పన్ను చెల్లింపుల పర్యవేక్షణపై చర్చించారు. శాఖల మధ్య సమన్వయం పెంచి ఆదాయాన్ని మెరుగుపరచాలన్నారు.

April 17, 2026 / 03:40 PM IST

ఆకివీడులో విద్యుత్ కష్టాలు

W.G: ఆకివీడులో వేసవి ముందే అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. రోజుకు 15 సార్లు సరఫరా నిలుస్తుండటంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు కోతలు లేవంటున్నా, ప్రతి గంటకు అంతరాయం కలుగుతోందని స్థానికులు మండిపడుతున్నారు. లైన్‌మెన్లు సరిగా స్పందించడం లేదని, తక్షణమే విద్యుత్ సమస్యను పరిష్కరించి నిరంతర సరఫరా అందించాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

April 17, 2026 / 03:32 PM IST

రాజమండ్రిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశం

E.G: రాజమండ్రిలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కార్యవర్గ సభ్యులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు.

April 17, 2026 / 03:30 PM IST

‘ప్రజల వినతులు సకాలంలో పరిష్కరించాలి’

CTR: ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. చిత్తూరు MLA గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించారు. మొత్తం 23 వినతులు అందినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.

April 17, 2026 / 03:30 PM IST

ప్రత్తిపాడులో ‘ప్రజా గ్రీవెన్స్’

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులతో చర్చించారు. అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

April 17, 2026 / 03:22 PM IST

‘రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి’

KRNL: మంత్రాలయం మండలంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. CPI నాయకుడు భాస్కర్ యాదవ్, CPM మండల కార్యదర్శి హెచ్. జయరాజు సీఐ దస్తగిరి బాబుకు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ఎమ్మిగనూరు -తుంగభద్ర ఫోర్‌లైన్ రోడ్డుపై అధిక వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

April 17, 2026 / 03:22 PM IST