VZM: గజపతినగరం మండలంలోని తమ్మారాయిడపేట గ్రామంలో అజాగ్రత్తగా కాల్చిన సిగరెట్‌ను పారి వేయడం వల్ల కోసి వేసిన కోరాడ పైడితల్లి మొక్కజొన్న తోట దగ్ధమైంది. దీంతో పాటు పొలంలో ఉన్న సోలార్ ప్యానల్స్, మోటార్ వైర్లు కాలిపోయాయి. దీనివల్ల సుమారు లక్షన్నర ఆస్తి నష్టం జరిగింది. పక్కనే ఉన్న మొక్కజొన్న తోటకు మంటలు వ్యాపించకుండా స్థానికులు మంటలు అదుపు చేశారు.