• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కారు బోల్తా.. నలుగురికి గాయాలు

NDL: శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిని అంబులెన్స్‌లో శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన కారును తొలగించి ట్రాఫిక్  పునరుద్ధరించారు. ప్రమాద ఘటనపై దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆరా తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2026 / 03:44 PM IST

జిల్లాలో వినోబా భావే అనుచరుల “సద్భావన యాత్ర”

PPM: ఆచార్య వినోబా భావే స్థాపించిన మహారాష్ట్రలోని పావనార్ ఆశ్రమం నుంచి “సర్వోదయ మండలి” సభ్యులు సద్భావన యాత్ర చేపట్టారు. ఈ యాత్ర రేపు మన జిల్లాలోకి రానుందని గాంధీజీ స్మారక నిధి ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, అహింస, సామాజిక సామరస్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతోందని తెలిపారు.

April 10, 2026 / 03:43 PM IST

డ్రోన్ సహాయంతో దోమల నివారణ మందు పిచికారి

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై. ఓ నంద‌లు ఇవాళ 45వ డివిజన్ సర్వేపల్లి కాలువ ప్రాంతంలో దోమల నివారణ చర్యలలో భాగంగా అత్యాధునిక డ్రోన్ల సహాయంతో మందు పిచికారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దోమల రహిత నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

April 10, 2026 / 03:40 PM IST

జిల్లా రైలు ప్రయాణికులకు శుభవార్త

ATP: జిల్లా మీదుగా నడిచే బెంగళూరు-కలబురగి (16563/64), బెంగళూరు-బీదర్ (16559/60), తిరుపతి-అకోలా (07605/06) ప్రత్యేక రైళ్లు ఇకపై సాధారణ ఛార్జీలు, రాయితీలతో రెగ్యులర్ రైళ్లుగా అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 10, 2026 / 03:40 PM IST

ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్

SS: ధర్మవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.

April 10, 2026 / 03:40 PM IST

జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా పరమేశ్వర రావు నియమకం

శ్రీకాకుళం జిల్లా BJP అధికార ప్రతినిధిగా బైపల్లి పరమేశ్వరరావు నియమితులయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఇవాళ ఈ ప్రకటన చేశారు. పరమేశ్వరరావు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.

April 10, 2026 / 03:36 PM IST

రేపు నర్సీపట్నంలో విద్యుత్ సరఫరా బంద్: ఈఈ

AKP: నర్సీపట్నం బలిఘట్టం పరిసర ప్రాంతాలలో రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని APEPDCIL EE రామకృష్ణ తెలిపారు. బలిఘట్టం, బయపురెడ్డిపాలెం, దుగ్గాడ, శ్రీరాంపురం,మెట్టపాలెం, కృష్ణాపురం, కళ్ళెంపూడి సీతయ్యపాలెం, ములకలపూడి బెన్నవరం ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

April 10, 2026 / 03:34 PM IST

తాగునీటి చలివేంద్రాల ప్రారంభం

KRNL: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎమ్మిగనూరులో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు MLA జయనాగేశ్వర రెడ్డి పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ప్రారంభించారు. వీవర్స్ కాలనీ పెద్ద పార్క్ సమీపంలో, గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు డీహైడ్రేషన్ సమస్యలకు గురికాకుండా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.

April 10, 2026 / 03:32 PM IST

ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌కు 19 వినతులు

CTR: చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 19 వినతులు అందగా, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రజాదర్భార్‌లో అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకుని స్పందించారు.

April 10, 2026 / 03:25 PM IST

గుర్తేడులో ప్రజాదర్బార్ కార్యక్రమం

ASR: గుర్తేడు గ్రామంలో మొదటిసారి ప్రజాదర్బార్ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఇటీవల 5 పంచాయతీలను ప్రభుత్వం గుర్తేడు మండలంగా ఏర్పాటు చేసింది. మొదటిసారి గుర్తేడు గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.

April 10, 2026 / 03:25 PM IST

జిల్లా డీఈవోకు స్టంట్ వేసిన వైద్యులు

ATP: జిల్లా డీఈవో ప్రసాద్ బాబు గుండె సంబంధిత సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రసాద్ బాబు 15 రోజులు సెలవులో వెళ్లడంతో, ఇన్‌ఛార్జి డీఈవోగా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన త్వరగా కోలుకోవాలని విద్యాశాఖ సిబ్బంది ఆకాంక్షించారు.

April 10, 2026 / 03:20 PM IST

ప్రజలే నేరుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు: సబ్ రిజిస్ట్రార్

NDL: బేతంచెర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజలు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ వనిత లక్ష్మి కోరారు. ప్రజలు దళారుల సహాయం లేకుండానే నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకుని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా వివరాలు అందజేస్తామన్నారు.

April 10, 2026 / 03:15 PM IST

చింతలపూడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ELR: చింతలపూడి క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్యే సత్వరమే సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

April 10, 2026 / 03:15 PM IST

వేదాంతం కంపెనీ వద్ద నిరుద్యోగుల ఆందోళన

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వేదాంతం ఆయిల్ కంపెనీ వద్ద నిరుద్యోగులు ఆందోళన ఉదృతం చేశారు. గత నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్నా స్పందన లేకపోవడంతో ఇవాళ కంపెనీ జీఎం మనుకున్నా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది క్రితం ఇస్తానన్న 100 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

April 10, 2026 / 03:15 PM IST

ఇళ్ల తొలగింపుపై స్పందించిన షేక్ నూరి ఫాతిమా

గుంటూరు నగరంలోని 56వ డివిజన్ పరిధిలోని మోతీలాల్ నగర్, రైల్వే భూములపై నివసిస్తున్న నిరుపేదల ఇళ్లను తొలగించబోతున్నారనే వార్తపై వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా స్పందించారు. పేద ప్రజల పక్షాన నిలిచిన ఆమె, బాధిత కుటుంబాలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌ను స్వయంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

April 10, 2026 / 03:14 PM IST