రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇఫ్తార్ విందుల నిర్వహణకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించే విందు కోసం రూ. 5 లక్షలు, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహణకు రూ. 3 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మైనార్టీ సంక్షేమ శాఖ త్వరలోనే ఈ కార్యక్రమాల తేదీలను ఖరారు చేయనుంది.