వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు(raghu rama krishnam raju) మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆయన తన సొంత పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ నేతలు వరసగా పవన్ ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… దీనిపై రఘురామ కృష్ణం రాజు స్పందించారు.
రూమ్ లో బంధించి పిల్లిని కొడితేనే.. అది కళ్లు పీకుతుంది. మరి పులిని కొడితే ఏమవుతుంది? అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు రఘురామ రాజు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వైసీపీ పార్టీ చేసింది అదేనని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ ను అనవసరంగా వైసీపీ నేతలు కెలికారని ఆయనతో తిట్లు తిన్నారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్లిళ్లను ప్రస్తావించిన రఘురామరాజు.. అది పవన్ వ్యక్తిగతమన్నారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శిస్తున్న వైసీపీ నేతలు.. తమ పార్టీ అధినేత ఇంటిలో జరిగిన పెళ్లిళ్లపై ఎందుకు నోరిప్పరని ఆయన నిలదీశారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి తొలి భార్య బతికుండగానే… విడాకులు కూడా ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నారని గుర్తు చేశారు. అలాగే వైఎస్ షర్మిల కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు కదా? అని అన్నారు.