E.G: నల్లజర్ల మండలం చీపురుగూడెంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. నాణ్యమైన రోడ్లను నిర్మించడమే తమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గ్రామంలో వాటర్ ట్యాంక్ ను నిర్మించి తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఆయన వెంటనే స్పందిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.