BPT: ప్రజలు వ్యవసాయ భూములు, స్థలాలు అమ్మడం లేదా కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 15నిమిషాల్లో పూర్తి అవుతుందని రెవెన్యూ&రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం బాపట్లలో మాట్లాడారు. వెబ్సైట్‌లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అని తెలిపారు.
అన్నమయ్య: కలికిరి మండలంలో 2019 – 24 మధ్య పక్కా ఇల్లు మంజూరై నిర్మాణంలో వివిధ దశలలో ఉన్న వాటిని పూర్తి చేయడానికి అదనపు నిధులు మంజూరు చేయనున్నట్లు సోమవారం ఎంపీడీఓ భానుమూర్తి రావు తెలిపారు. గతంలో ప్రకటించిన రూ. 1.8 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 70 వేలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
GNTR: మంగళగిరిలో సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ పలు కీలక ప్రకటనలు చేశారు. సుమారు రూ.1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పేదలకు శాశ్వత నివేశన పట్టాలుగా ఇస్తున్నామన్నారు. రెండేళ్ల తరువాత లబ్ధిదారులకు ఆ భూములను విక్రయించుకునే హక్కు ఉంటుందని చెప్పారు. మంగళగిరిలో 100పడకల ఆసుపత్రికి 13న శంకుస్థాపన చేస్తామన్నారు.
గుంటూరు కొత్తపేటలోని పోస్ట్ ఆఫీస్ రోడ్డు-గౌరీ శంకర్ సినిమా హాల్ వెనుక పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్‌లకు చెత్త తరలించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఘటన స్వయానా గుంటూరు నగర ఇన్‌ఛార్జ్ మేయర్ డివిజన్ కావడం దుర్మార్గమన్నారు.
KDP: వేంపల్లి పట్టణంలోని సంగం వీధికి చెందిన నామ శ్రీనివాసులుకు క్యాన్సర్ వ్యాధి వైద్య నిమిత్తం కోసం రూ. 5లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును సోమవారం ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడంతో లబ్ధిదారుల కుటుంబం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ప్రకాశం: రాచర్ల లోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చెప్పారు.
KRNL: ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామంలో మంగళవారం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వృషభలకు వరుసగా రూ.30వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
YLR: జిల్లాలోని హిందూ యువజన సంఘం(YMHA) హాలులో ఆదివారం సాయంత్రం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం శ్రీ రామ పరిపాలన చేస్తుందన్నారు.
NTR: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండపల్లికి చెందిన ఓ బాలిక(5)పై మతిస్థిమితం లేని వ్యక్తి(42) అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
W.G: భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్, జ్యోతిరావ్ పూలేల జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలని కోర...
PPM: కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ దొంపలపాడులో నివసిస్తున్న ఊలక సుమన్ గత రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా తమ తెల్ల రేషన్ కార్డుకు నిత్యవసర సరుకులు ఇవ్వట్లేదని వాపోతున్నాడు. డీలర్‌ను సంప్రదిస్తే ఎమ్మార్వో ఆఫీసు సంప్రదించాలన్నారని ఆఫీసుకు వెళ్లి సమస్యను వివరించామన్నారు.
అన్నమయ్య: వైసీపీ మదనపల్లె ముస్లిం ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడిగా షేక్ గుండ్లూర్ మహమ్మద్ ఫయాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీ మిథున్ రెడ్డి, ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అధికార ప్రభుత్వంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతానని స్పష్టం చేశారు.
NDL: కోటపాడు గ్రామంలో బీటెక్ విద్యార్థిని వైష్ణవి రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడలో పసుపు రంగు నీళ్లు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వైష్ణవి కర్నూలు పట్టణంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నది. పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి విక్రమ్ పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య: జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన రద్దు అయినట్లు కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8, 9 తేదీల్లో జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రద్దయింది. దీంతో నియోజకవర్గాల్లో మార్కెట్ చైర్మన్‌ల నియామకాలు కొలిక్కి వస్తుందన్న ఆశావాహులకు మళ్లీ నిరాశే ఎదురైంది.