NTR: చందర్లపాడు మండలం పాత బెల్లంకొండ వారి పాలెం గ్రామానికి చెందిన సవలం లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, కుటుంబానికి భీమా సహాయం అందింది. సోమవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ప్రధానమంత్రి జన సురక్ష భీమా పథకం కింద మృతుడి సతీమణి తిరుమలమ్మకు రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వం ఇలాంటి కష్ట సమయాల్లో అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.