VZM: నెల్లిమర్ల జూట్ మిల్ లాకౌట్‌ని తక్షణమే ఎత్తివేయాలని శ్రామిక సంఘం అధ్యక్షులు చిక్కాల గోవింద కోరారు. నెల్లిమర్ల జ్యూట్ మిల్ సమీపం పాతపోస్టాఫీసు వద్ద సోమవారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిక్కాల గోవిందరావు మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్ నెల మొదటి వారం జీతం కార్మికులకు చెల్లించడంతో పాటు, 2023-24 సంబంధించి బోనస్ రూ.3 వేలు చెల్లించాలన్నారు.
AKP: బాధితులకు పరిహారం ఇవ్వకుండా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రశ్నించారు. గృహ నిర్బంధంలో ఉన్న అప్పలరాజు మాట్లాడుతూ.. పోలీస్ బందోబస్తుతో జేసీబీలను వినియోగించి కొబ్బరి చెట్లను నేలమట్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు: గురజాల నియోజకవర్గంలో కాలువ పనులు చేయకుండానే వైసీపీ నాయకులు బిల్లులు తీసుకున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. సోమవారం పిడుగురాళ్ల టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో లక్షల కోట్ల నిధులు వైసీపీ నాయకుల జేబులు నింపుకున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయిందన్నారు.
ప్రకాశం: పంగులూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మండలంలోని రేషన్ డీలర్లు మరియు ఎండీవో ఆపరేటర్లతో మండల తహసీల్దార్ సింగారావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతినెల 15వ తేదీ లోపు ప్రతి ఒక్కరు డీడీలు కట్టాలన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం 6:30కే రేషన్ పంపిణీ ప్రారంభం కావాలన్నారు.
VZM: నిత్యజీవితంలో యోగాను ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని యోగా గురువు జామి భాస్కరరావు సూచించారు. బొబ్బిలిలోని వెలగవలస గ్రామంలో విద్యార్థులకు యోగాసనాలపై సోమవారం అవగాహన కల్పించారు. కంటి ఎక్సర్ సైజులు, వజ్రాసనం, పద్మాసనం, ప్రాణామాయం, ధ్యానం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు.
E.G: బాల్య వివాహాలు, వాటిని ప్రోత్సహించటం చట్ట రీత్యా నేరమని ఇందుకు సంబంధించి భాగస్వామ్యం అయ్యే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాజానగరం మండలం కొత్తుంగపాడు గ్రామంలో బాల్య వివాహం జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
PLD: పల్నాడు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు 50% సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాలని పల్నాడు జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగం, వ్యాపారం చేస్తూ సొంత మూడు చక్రాల వాహనం కలిగిన దివ్యాంగులకు పెట్రోలు సబ్సిడీ పొందేందుకు అర్హులని అన్నారు.
PLD: దాచేపల్లి మండలం పెదగార్లపాడు శ్రీసిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో సోమవారం ఓ మహిళ రైతు ధర్నా చేపట్టారు. మహిళ రైతు కామిశెట్టి లక్ష్మమ్మ మాట్లాడుతూ.. తనకు చెందిన ఎకరా 70 సెంట్ల పొలంలో శ్రీసిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రోడ్డు నిర్మించి సుమారు సంవత్సర కాలం అయిందని తెలిపారు. అయితే ఇప్పటికి తనకు నష్ట పరిహారం చెల్లించలేదని, తనకు న్యాయం చేయాలని కోరింది.
E.G: రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మృతిపై సబ్ కలెక్టర్ కల్పశ్రీ చేత విచారణ చేయించనున్నట్లు ITDO PO కట్టా సింహాచలం సోమవారం మీడియాకు తెలిపారు. పీవో సబ్ కలెక్టర్‌తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు మృతురాలి బంధువులతో మాట్లాడి.. తెల్లం లక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు.
SKLM: పోలాకి మండలం కత్తిరివానిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పంచాయతీల అభివృద్ధికి నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అధికారులు రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
NLR: ఇందుకూరుపేట మండలంలోని కొమరిక శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి సోమవారం అమ్మవారి జన్మ నక్షత్రము, అమావాస్య సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం, గణపతి పూజ, దేవి ఖడ్గమాల, కుంకుమార్చన, శ్రీ చక్ర పూజ, తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక పుష్పా అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
SKLM: సంతబొమ్మాలి మండలం కొల్లిపాడు పంచాయతీ సర్పంచ్ గొరుసు సవరయ్య మాతృమూర్తి మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
ELR: జంగారెడ్డిగూడెంలో సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యత గల పదవిలో ఉంటూ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పి ఆ పదము నుండి వైదొలగాలన్నారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ప్రజల నుంచి అందే ఆర్జీలలో ఒక్కటి కూడా పెండింగ్లో లేకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. సాలూరు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 106 వినతులు వచ్చాయని వాటికి పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు.
NTR: కంచికచర్ల మండలం మొగులూరు గ్రామం వెళ్లే రహదారిలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. 8 సంవత్సరాల నుంచి ఈ రహదారి అధ్వానంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనదారులు మొగులూరు గ్రామం వెళ్లాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.