VSP: ఈనెల 3వ తేదీన కొయ్యూరు మండలంలోని ఎం. మాకవరం పంచాయతీలో పీసా కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి శివ శంకర్ గురువారం తెలిపారు. పీసా వైస్ చైర్మన్, కార్యదర్శి పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈమేరకు ఓటు హక్కు కలిగిన పంచాయతీ వాసులు అందరూ పీసా కమిటీ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
VZM: రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్త చెప్పారు. నేడు మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్‌ను పవన్ ప్రారంభించనున్నారు. క్యాన్సర్‌ను కనుగొనే టెస్టులు ప్రతీ ఊరిలో చేయడమే ఈ వ్యాన్ల లక్ష్యం. మరోవైపు నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉచిత ఆర్టీసీ బస్సుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
KRNL: టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని ఎమ్మిగనూరులోని ఆయన స్వగృహంలో మంత్రాలయం ఎస్సై పరమేశ్ నాయక్ కలిశారు. పూల బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంగా పోలీస్ స్టేషనుకు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం చేయాలని ఎస్సైకి తిక్కారెడ్డి సూచించారు.
TPT: తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఆఫ్ ఫిజియాలజీ ప్రొఫెసర్ ఉమా మహేశ్‌ను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ఓ విద్యార్థిని పట్ల లైంగిక వేధింపుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రామచంద్ర రావు ఉత్తర్వులు జారి చేశారు.
CTR: తిరుచానూరు రోడ్డులోని నందమూరి తారక రామారావు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రంలో మహిళలకు టైలరింగ్, నర్సింగ్ విభాగంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ ఫర్జానా తెలిపారు. రెండునెలల కాలవ్య వధిలో జరిగే శిక్షణకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 40 వయసుగల మహిళలు అర్హులన్నారు. వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
కోనసీమ: కపిలేశ్వరపురం ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇసుక ర్యాంపు నిర్వహణ సక్రమంగా జరగాలని RDO అఖిల పేర్కొన్నారు. ఇసుక ర్యాంపును ఆమె సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా RDO మాట్లాడుతూ.. జియో కోఆర్డినేట్ పరిధిలో యంత్రాలను వినియోగించకుండా మాన్యువల్‌గా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తవ్వకాలు జరపాలన్నారు.
PPM: గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం ఉదయం 9 గంటలకు 19వ వార్డులో ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీలో పాల్గొంటారని, 10గంటలకు పాచిపెంట మండలం శ్రీ పారముకొండ రోడ్డు ప్రారంభోత్సవానికి హాజరవుతారని మంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య: రైల్వే కోడూరులో ఆవుల యజమానులు విచ్చలవిడిగా ఆవులను రోడ్లపైకి వదిలేస్తున్నారు. దీంతో వాటికి తినడానికి తిండి లేకపోవడంతో చెత్త డబ్బాల వద్ద వ్యర్థాలను ఏరుకుని తిని రోడ్డుపైన పడుకుంకుటున్నాయి. దీంతో రోడ్డుపై వెళ్లె వాహనాలకు పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకొని ఆవుల యజమానులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.