W.G: కేరళ రాష్ట్ర పోలీస్ డీజీపీగా ప.గో జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ సోమవారం నియమితులయ్యారు. కేరళ నూతన డీజీపీగా చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామంలో బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈయన 1991లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
VZM: రెవెన్యూ సేవలు నిజాయితీగా అందించాలని బొబ్బిలి ఎమ్మార్వో ఎం.శ్రీను సూచించారు. సోమవారం స్దానిక MRO కార్యాలయంలో VROలు, రెవెన్యూ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. రెవెన్యూ పనులు కోసం అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2019కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేసిన ఇళ్లను క్రమబద్దీకరణ చేయాలన్నారు.
VZM: బాడంగి మండలం పాల్తేరులో సోమవారం రాత్రి బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు పల్లెనిద్ర చేశారు. గ్రామంలోని పెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించి గంజాయి వలన జరిగే నష్టం, మహిళలపై జరుగుతున్న నేరాలు నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి వలన జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
AKP: పాయకరావుపేట బీసీ బాలికల కళాశాల హాస్టల్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలోకి వెళ్లి భోజనం, కూరలను పరిశీలించారు. భోజనం సరిగా లేదని.. ఈ మెనూ ఏంటని హోంమంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా సన్న బియ్యం వాడాలన్నారు. హాస్టల్‌పై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
VSP: జిల్లా గంజాయి కేసులో నిందితుడు నెల్ల తేజమూర్తికి 14 ఏళ్ళ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1.40 లక్షలు జరిమానా విధిస్తూ.. విశాఖ మెట్రోపాలిటన్ మొదటి అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపారు. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష అదనంగా విధించబడుతుందన్నారు.
GNTR: తుళ్లూరు మండలంలోని ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్ మరమ్మతులకు గురవడంతో ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వెలగపూడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్లాంట్‌ను బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని సోమవారం గ్రామప్రజలు విజ్ఞప్తి చేశారు.
KRNL: తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసం చేసిన ముఠాను కర్నూలు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాధితుడి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నకిలీ బంగారు బిస్కెట్లు, నగదు, పోలీస్ యూనిఫామ్స్, వాకీ టాకీలు, హ్యాండ్ కఫ్స్ సహా అనేక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
VSP: ప్యాసింజర్ రైలు చార్జీల పెంపు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయని విశాఖ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. సాధారణ తరగతిలో 500 కి.మీ. వరకు దూరాలకు ఎటువంటి పెంపూ లేదు. 501 నుంచి 1500 కి.మీ. దూరాలకు రూ. 5, 2500 కి.మీ. దూరాలకు రూ. 10, 2501 km నుంచి 3000 కి.మీ. దూరాలకు రూ. 15 పెంపు ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది.
KDP: వేముల మండలం పెద్దచటూరులో సోమవారం ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించారు. కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. పక్కా గృహాలు వివిధ రకాల పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు.
VZM: భోగాపురం మండలం ముక్కాంలో తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 25 ఏళ్ల నుంచి తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఏళ్ల కాలం నుంచి ఉన్న సమస్యను పరిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. వివిధ వనరులు నుండి నిధులు సేకరించి తాగు నీటి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
KRNL: నేటితరం విద్యార్థులకు చట్టసభలపై అవగాహన కల్పించడం ఎంతగానో అవసరమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. సోమవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవితంలో ఎవరూ కూడా ఆశించి పని చేయరాదని అన్నారు.
అన్నమయ్య: వైకాపా ప్రభుత్వ హయాంలోనే విద్యారంగం నాశనం అయ్యిందని టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక మదనపల్లె పార్లమెంట్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఈసెట్ కౌన్సిలింగ్ నిర్వహణపై విమర్శించడం జగన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనమని పోలి శివకుమార్ విమర్శించారు.
KDP: పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి వీరపునాయన పల్లె మండలంలో 6340 మంది రైతులు అర్హులని వ్యవసాయ అధికారి శ్యాంబాబు సోమవారం తెలిపారు. నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు నిధులు త్వరలో ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. బ్యాంక్ అకౌంటుకు ఆధార్ లింకులేని రైతులు వివరాలను కూడా ఇప్పటికే సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అన్నమయ్య: కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా జూలై 9న సమ్మెను జయప్రదం చేయాలని సమ్మె పోస్టర్లను సిఐటియు నాయకులు రైల్వే కోడూరు ఎన్జీవోహోమ్‌లో సోమవారం సాయంత్రం విడుదల చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా కార్మిక చట్టాలలో మార్పులు చేసిందన్నారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో నూతనంగా నిర్వహిస్తున్న కమిటీ హాల్ భవన నిర్మాణాన్ని హిందూపురం ఎంపీ పార్థసారథి సోమవారం పరిశీలించారు. ఎంపీ నిధుల కింద రూ. 80 లక్షల నిధులతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ హాల్ భవనం నిర్మాణం ఎంత వరకు జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.