GNTR: పెదకాకానిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ బోర్డుపై సమీక్ష చేయడాన్ని స్వాగతించారు. అయితే, మరణించిన కార్మికుల కుటుంబాలకు బెనిఫిట్లు నిరాకరించడం, 46 వేల క్లైములను నిలిపివేయడం అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.