W.G: పందెం కోళ్లు, నాటు కోళ్లపైనా వైరస్ దాడి చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేలకు కోళ్ల పెంపకం జోరుగా సాగుతోంది. అయితే ఈ సారి రాచికెడ్ డిసీజ్ (ఆర్డీ), ఇతర వైరస్ లతో మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తణుకు పరిసర ప్రాంతాల్లో పెంపకందారులకు రూ.లక్షల్లో నష్టం కలుగుతోందని వాపోతున్నారు.
W.G: గణపవరం మండలం వాకపల్లిలో మురుగు నీరు ప్రవహించే డ్రైన్ గత కొన్నేళ్లుగా పూడుకుపోయి మురుగు నీరు బయటికి వెళ్లేందుకు సమస్య తలెత్తిన నేపథ్యంలో డ్రైన్ పూడిక తీత పనులను గురువారం NDA కూటమి నాయకులు ప్రక్షాళన చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఈ యొక్క పూడిక తీత పనులకు శంకుస్థాపన చేశారు.
VZM: జిల్లా వ్యాప్తంగా రహదారులపై గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ముఖ్యంగా ఆయా మండలాల్లో ప్రధాన రహదారుల్లో గుంతలు ఏర్పడిన రోడ్లను గుర్తించి గడిచిన నెల రోజులుగా మరమ్మతులు చేపడుతున్నారు. ఈ పనులు దాదాపు పూర్తైనట్లు చెబుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో గుంతలు సరిగా కప్పడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
VZM: జనవరి 5న ఆదివారం విజయవాడలో హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని కావున హిందూ ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, హిందూ బంధువులంతా తమ మద్దతు తెలియజేస్తూ తమ పేరును నమోదు చేసుకోవాలని విజయనగరం పార్లమెంటరీ జిల్లా కార్యవర్గ సభ్యులు, సారధి నీటి సంఘం సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదన రావు గురువారం రాజాం పట్టణంలో ఒక ప్రకటనలో కోరారు.
VZM: ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.322 కోట్లతో మొత్తం 2,671 పనులు మంజూరయ్యాయి. అధికారక గణాంకాల ప్రకారం కేవలం 40 శాతం పనులే పూర్తయినట్టు తెలుస్తోంది. MLA ల సిఫార్సులతో తమ అనుచరులకు పనులు అప్పగించారు.
ELR: ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు పోలీస్ స్టేషన్స్‌కు నూతన వాహనాలను గురువారం ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు అందజేశారు. ఈ సందర్భంగా వాహన తాళాలను సంబంధిత స్టేషన్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అద్నాన్ నయం అస్మి, కలెక్టర్ నాగరాణి, ఏలూరు రేంజ్ ఐజి అశోక్ పాల్గొన్నారు.
ASR: గోరాపూర్ వంతెన నుంచి జాకర వలస వరకు కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. వారు మాట్లాడుతూ.. గోరాపూర్ గేడ్డలో వంతెన నిర్మించారు. కానీ కనెక్టివిటీ రోడ్డు నిర్మించకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వర్షం కురిసినప్పుడు ఉన్న మట్టి రోడ్డు అంతా బురదమయంగా తయారవుతుందని, దీంతో జారిపోయి పలు ప్రమాదాలకు గురవుతున్నారు.
VSP: ఈనెల 3వ తేదీన కొయ్యూరు మండలంలోని ఎం. మాకవరం పంచాయతీలో పీసా కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి శివ శంకర్ గురువారం తెలిపారు. పీసా వైస్ చైర్మన్, కార్యదర్శి పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈమేరకు ఓటు హక్కు కలిగిన పంచాయతీ వాసులు అందరూ పీసా కమిటీ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.