W.G: ఉండి మండలం, పాముల పర్రులోని రొయ్యల చెరువుల్లో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలపడంతో లక్షలాది రూపాయల విలువైన రొయ్యలు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామ సర్పంచ్ భర్త కేశన బలుసుల మాస్టర్ 12 ఎకరాలు, కేశన యాదగిరి 5 ఎకరాల చెరువులో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.