VZM: వ్యవసాయంలో AI టెక్నాలజీ ద్వారా నూతన ఒరవడి సృష్టించవచ్చునని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీ ద్వారా రైతులు ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చో, పంటల దిగుబడి పెంచేందుకు AIను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం AI ద్వారా వ్యవసాయ అభివృద్ధికి రూ. 500 కోట్లను కేటాయించి ఫలతాలు సాధించారన్నారు.