కృష్ణా: నేపాల్ రంగసాల ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి చెందిన పవర్ లిఫ్టర్ దుర్గా సత్యనారాయణ 66 కేజీల విభాగంలో 610 కేజీల బరువు ఎత్తి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించాడు. ఈ క్రమంలో ఆయనను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఇవాళ అభినందించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.