SKLM: నరసన్నపేటలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అసెంబ్లీ జీరో అవర్‌లో సోమవారం ప్రస్తావించారు. సారవకోట, జలుమూరు, పోలాకి మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మేరకు గొట్టా బ్యారేజ్ నుంచి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.