W.G: జబర్దస్త్ నటుడు అప్పారావు శనివారం పాలకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. జబర్దస్త్, పలు నాటికలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. వరుడి తండ్రి తన స్నేహితుడు కావడంతో ఈ వివాహానికి హాజరైనట్లు అప్పారావు తెలిపారు. ఆయన రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. పలువురు సెల్ఫీలు దిగారు.
ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఆన్లైన్లో కొన్ని పేపర్లలో తప్పుడు రాతలు రాయడం తగదని అన్నారు. ప్రజలు వీటిని నమ్మవద్దని కోరారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం వేకువజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి మూలమూర్తికి సింధూర, ఆకు పూజలు ఘనంగా జరిగాయి. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలం పద్మాపురం గ్రామం సమీపంలో NH5 రోడ్డు పనులకు సూపర్వైజర్గా పని చేస్తున్న ఏనుగు ప్రతాప్ రెడ్డి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వేమానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రకాశం: మార్కాపురం ఏమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలో 15వ వార్డులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొని వీధులను మున్సిపల్ సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రకాశం: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద శనివారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే 108 సహాయంతో సమీప వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ వాల్తేరు డివిజన్ను నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఉంచేందుకు కృషి చేసిన ఎంపీ శ్రీభరత్కి విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద రైల్వే ఉద్యోగులు, నాయకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రైల్వే యూనియన్ సీనియర్ విశ్రాంత నాయకుడు చలసాని గాంధీ, రైల్వే నాయకుడు RVSS రావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
SKLM: లావేరు మండలం పరిధిలోని తాళ్లవలస పంచాయితీ సుభద్రాపురం గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఇందులో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రాజా పాల్గొని, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.వెంకటరాజు, ఈవోపీఆర్డీ పంచాయతీ కార్యదర్శి, వేతనదారులు పాల్గొన్నారు.
తూ.గో: కాజులూరు మండలం, గొల్లపాలెం గ్రామంలో శివాలయం పక్కన వేంచేసివున్న శ్రీ మాతా గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దశమి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11:54 స్వామివారి కళ్యాణం, కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు నిర్వహించనున్నారు.
సత్యసాయి: ధర్మవరంలోని బలిజ కల్యాణ మండపం వద్ద హిందూ శ్మశాన వాటికలో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణం పనులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అలాగే పట్టణంలో రూ.1.58 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హరిత ధర్మవరమే లక్ష్యంగా పట్టణంలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు.
పల్నాడు: వెల్దుర్తి మండలం విజయపురి సౌత్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఐదు పులుల కదలికలను కెమెరాలో గుర్తించామని ఫారెస్ట్ రేంజర్ సుజాత తెలిపారు. పులుల లెక్కింపు పూర్తయినట్లు తెలిపారు. ఒక ఆడ, మగ పులితో పాటు, మూడు పులి పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఫారెస్ట్లోకి వెళ్లొద్దని, నీరు కోసం గ్రామాలలోకి పులులు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రకాశం: అద్దంకి పట్టణంలో నెల 16న కరాటే టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. కరాటే, కుంగ్ ఫూ పోటీలు నేషనల్ లేవల్లో జరుగుతున్నాయని చెప్పారు. సీనియర్ కరాటే మాస్టర్లు రాంబాబు, రత్నం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. అద్దంకిలోని గీతా మందిరం వద్ద ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలియజేశారు.
ప్రకాశం: పొదిలి పట్టణంలోని రథం బజార్లో ఉన్న సాయిబాబా దేవస్థానంలో సాయిబాబాను శనివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. గర్భగుడిలోని స్వామివారిపై 10 నిమిషాల పాటు కిరణాలు ప్రసరించాయి. ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల కమ్మల నీడను చీల్చుకుని సూర్యకిరణాలు గర్భగుడిని తాకడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్లో విడుదలైన ఘంటసాల ది గ్రేట్ చలన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని చిత్ర దర్శకుడు రామారావు తెలిపారు. థియేటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఒక గాయకుడికి పూర్తి నిడివి చిత్రాన్ని రూపొందించామన్నారు. అంతేకాకుండా నేటి తరానికి ఆయనను పరిచయం చేసినట్లే అవుతుందని స్పష్టం చేశారు.