సత్యసాయి: సోమందేపల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ శుక్రవారం దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రి స్థానిక వైసీపీ శ్రేణులతో కలిసి ఉత్తర వైకుంఠ ద్వారం ద్వార స్వామి వారికి దర్శించుకుని ప్రత్యేక పూజ చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాజీ మంత్రికి శటగోపం పెట్టి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఆమెను సన్మానించి ప్రసాదాలు అందజేశారు.
ATP: టీటీడీ నిర్లక్ష్యంతో ఆరుగురు భక్తుల నిండు ప్రాణాలు కోల్పోయారని ఇందుకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని గుంతకల్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా తొక్కిసిలాటలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.
NLR: అల్లూరు మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో శుక్రవారం కోడి పందాలు నిర్వహణ, పాల్గొనుట చట్ట రీత్యా నేరం అనే అంశంపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కోడిపందాలు నిర్వహించడం-పాల్గొనడం చట్టరీత్య నేరం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
NLR: కోవూరు గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ అభివృద్ధికి పారిశుద్ధ్య కార్మికులు విశిష్ట సేవలు అందిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం వైసీపీ నేతలు పంచాయతీ కార్యదర్శికి వినత పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
SKLM: నరసన్నపేట పట్టణంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలలో భక్తులు పోటెత్తారు.
SKLM: యువత క్రీడా స్ఫూర్తితో మెలిగి, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఆమదాలవలస జూనియర్ కాలేజీలో ప్రారంభించిన 2025 టోర్నమెంట్ను డాక్టర్ దానేటి శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
NLR: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలలో ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి పన్ను వసూళ్లను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. స్థానిక 7వ డివిజన్లోని అరుణాచలం వారి వీధి, రైతు బజార్, జయప్రకాశ్ వీధి, సచివాలయాల పరిధిలో కమిషనర్ శుక్రవారం పర్యటించారు.
NLR: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గూడూరు నియోజకవర్గంలోని ప్రజలు సుఖ: శాంతులతో వర్థిల్లాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు తెలిపారు.
NLR: ఉదయగిరి పట్టణంలోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శుద్ధ భావి వీధి, బ్రాహ్మణ వీధి రామాలయాల్లో పూజలు వైభవంగా కొనసాగాయి. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని ఆలయాల్లో పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
NLR: స్త్రీనిధి రుణం మంజూరు అయిన వెంటనే క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ అన్నారు. గురువారం తిరుపతిలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల స్త్రీనిధి సిబ్బందితో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లోన్ సభ్యులకు అందకపోతే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
NLR: తోటపల్లి గూడూరు మండలం పరిధిలోని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, కార్పొరేషన్ల రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీ లోపల APOBMMS ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. పండుగ అనంతరం పాఠశాలలు 20వ తేదీన పునఃప్రారంభమవుతాయన్నారు. మిషనరీ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ప్రకటించినట్లు తెలిపారు. ఆయా పాఠశాలల్లో 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభ మవుతాయన్నారు.
SKLM: మూలపేట పోర్టు నిర్మాణానికి సంబంధించి టెక్కలి నుంచి మూల పేట వరకు అవసరమయ్యే 317 ఎకరాల రోడ్డు మార్గంలో వంశధార కాలువ సాగునీరు వెళ్తున్న క్రాసింగ్ ప్రాంతాల్లో గురువారం వంశధార, పోర్ట్ అధికారులు పరిశీలించారు. రైతులకు సాగునీరు ఇబ్బందులు లేకుండా వెళ్లే మార్గాలపై ఆయన సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.
SKLM: సంక్రాంతి పండుగకు గ్రామాలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు సూచించారు. ఈ మేరకు గురువారం అవగాహన కల్పించారు. ఆభరణాలు వెంట తీసుకెళ్లాలని, లేనిపక్షంలో బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. సమీప పోలీస్ స్టేషన్లో గానీ తెలియజేస్తే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా భద్రత కల్పిస్తామన్నారు.
NDL: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున నుండే పోటెత్తారు. బనగానపల్లె పట్టణంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఉత్తరం ద్వారా వెళ్లి భక్తులు దర్శించుకుంటున్నారు. ఏకాదశి రోజున ఉత్తరం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.