CTR: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను ఉదయం 6:20 గంటలకు మూసివేస్తున్నట్లు ఈవో వెంకట కిషోర్ తెలిపారు. సాయంత్రం 6:47కు గ్రహణం ఉండటంతో 9 గంటల ముందుగానే ఆలయం మూసివేస్తున్నారు. 4వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు, సేవలు యథావిధిగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
CTR: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను ఉదయం 6:20 గంటలకు మూసివేస్తున్నట్లు ఈవో వెంకట కిషోర్ తెలిపారు. సాయంత్రం 6:47కు గ్రహణం ఉండటంతో 9 గంటల ముందుగానే ఆలయం మూసివేస్తున్నారు. 4వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు, సేవలు యథావిధిగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
W.G: పాలకొల్లులోని ఛాంబర్స్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చెన్నైకు చెందిన జియల్ కంపెనీ బుధవారం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.డీ.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ కంపెనీలో పనిచేయడానికి అర్హులని, అర్హత కలిగిన వారు కళాశాలలో జరిగే జాబ్ మేళాకు విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావచ్చన్నారు.
ASR: సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ అరుదైన ఘనత సాధించారు. 2026 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు లభించింది. 4బీ పెన్సిల్ ముల్లుపై కేవలం 4 మి.మీ వెడల్పు, పొడవుతో అతి సూక్ష్మ తాజ్‌మహల్‌ను 6 గంటల శ్రమతో రూపొందించారు. నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు రికార్డు పత్రాన్ని మంగళవారం పోస్టల్ ద్వారా పంపారు.
AKP: రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారులు ఈనెల 28వ తేదీలోగా జీవన ప్రమాణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా ఖజానా అధికారిణి సుభాషిణి మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.పెన్షన్ దారులు జీవన ప్రమాణ యాప్ లేదా సమీప పోస్ట్ ఆఫీస్ లో బ్యాంకులో సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వీటిని సమర్పించాలన్నారు.
KDP: ప్రతి రక్షిత అడవి, వన్యప్రాణి కేంద్రం చుట్టూ 1KM మేర ఎకో-సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం ప్రొద్దుటూరు, బద్వేలు అటవీ ప్రాంతాల మాస్టర్ ప్లాన్‌పై DFO వినీత్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అటవీ సంపదను, వన్యప్రాణులను రక్షించేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గాలిలో తేమ మధ్యాహ్నం సమయానికి 35 శాతానికి పడిపోతుందని, ఆగ్నేయ దిశ నుంచి గంటకు 5కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెంలోని రొయ్యల చెరువులో మంగళవారం ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన మోతీ పరదార్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న సమిశ్రగూడెం SI సుందర్ బాలాజీ రావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
KKD: జిల్లాలోని అన్ని పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ షాన్మోహన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో పారిశుద్ధ్యం, మంచినీరు, వీధిలైట్ల నిర్వహణ, అన్న క్యాంటీన్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ సుపరిపాలన అందించాలని ఆదేశించారు.
NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడు సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల పొట్టు లోడుతో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం మంటలు వ్యాపించగా పోలీసులు, రాంకో ఫైర్ సిబ్బంది సహాయంతో స్థానికులు మంటలను ఆర్పివేశారు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో అక్కడే ఉన్న పొట్టు లారీలో మళ్లీ మంటలు వ్యాపించాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది.
NLR: జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల కేంద్రాలను మంగళవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా తనిఖీ చేశారు. నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు ఆయన సూచించారు.
సత్యసాయి: గొల్లపల్లి రిజర్వాయర్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పర్యాటక అధికారి నరసయ్య బృందం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టింది. రిజర్వాయర్‌లో పర్యాటకులను ఆకర్షించేందుకు బోటింగ్ కేంద్రం ఏర్పాటుపై అధికారులు చర్చించారు. పర్యాటకుల బస కోసం అత్యాధునిక రిసార్టులు, గదుల నిర్మాణానికి అనువైన స్థలాలను ఈ సందర్భంగా గుర్తించారు.
KRNL: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ.కబర్ధి నేతృత్వంలో మంగళవారం స్థానిక జిల్లా కారాగారాన్ని సందర్శించింది. ఈ బృందం జైలులోని వసతులు, ఖైదీల యోగక్షేమాలను స్వయంగా పరిశీలించింది. జైలు కిచెన్ను సందర్శించిన అధికారులు, ఖైదీలకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసింది.
AKP: కోటవురట్ల మండలం తంగేడు గ్రామంలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన విత్తనాలు తయారు చేయాలని సూచించారు. తయారుచేసిన విత్తనాలను మెంటలేషన్ చక్కగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారిణి సరోజిని పాల్గొన్నారు.
TPT: పదవ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 01 వరకు నిర్వహించబడతాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 31,334 మంది విద్యార్థులు 179 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారు. ప్రశ్నపత్రాల రవాణాకు కట్టుదిట్టమైన భద్రత, కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, సెక్షన్ 144 అమలు చేయాలని సూచించారు.