ELR: కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాల్లో సోమవారం జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. కుక్కునూరు మండలంలోని జిన్నేలగూడెం అటవీ ప్రాంతంలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో 200 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
VZM: అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించబోమని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. ఎన్‌సీఎస్ రోడ్డులోని నిర్మాణాలపై ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కమిషనర్ పల్లి నల్లనయ్య చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రణాళిక సిబ్బంది ఆధ్వర్యంలో ఆ భవనాలను సోమవారం కూల్చివేశారు.
ELR: స్పెషల్ కోర్టు ఏలూరు వారి ఉత్తర్వులు, ప్రభుత్వ జీవో నం.519, అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయడానికి జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా రిజిస్ట్రార్, డీపీఆర్, జిల్లా ఐటీ అధికారి, సీఐడీ అదనపు ఎస్పీ, నగరపాలక సంస్థ ఏవో లతో కలెక్టర్ కమిటీ వేశారు.
పార్వతీపురం మండలంలోని రహదారులు గుంతలతో అధ్వానంగా మారాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరి ప్రమాదబరితంగా మారాయి. ఈ మార్గంగుండా వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
NLR: వింజమూరు మండలం కాటేపల్లి పంచాయతీ సర్పంచ్ మువ్వారి విజయలక్షమ్మ చెక్ పవర్ రద్దుచేస్తూ సోమవారం కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జరిశారు. పంచాయతీలో 14,15వ ఆర్ధిక సంఘం నిధులు, సాధారణ నిధులను సర్పంచ్ దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అంతేకాక పంచాయతీ నిధులువెనక్కి వెళ్లేదుకు కూడాసర్పచే కారణంగా తేల్చారు. దీంతో ఆమెకు 6నెలల పాటు చెక్ పవర్‌ను రద్దు చేసారు.
NLR: విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహిస్తున్న అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బేల్ టోర్నమెంట్ పురుషుల పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. 33 యూనివర్సిటీలు పాల్గొనగా, సోమవారం 17 జట్లు తదుపరి దశకు చేరాయి. మంగళవారంతో నాకౌట్ మ్యాచ్లు ముగిసి, బుధవారం లీగ్ దశలో నాలుగు జట్లు తలపడనున్నాయి. టోర్నీకి వర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు అధ్యక్షత వహిస్తున్నారు.
కాకినాడ: జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.
కడప: గత వైసీపీ పాలనలో నిధుల లేమితో అసంపూర్తిగా వదిలేసిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక ఉప కేంద్రాలు 387 ఉన్నాయి. వాటికి అంచనా వ్యయాన్ని పెంచాలని వైసీపీ నాయకులు, గుత్తేదారులు ఒత్తిడి చేయడంతో రూ.17.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అయినప్పటికీ పనులు జరగలేదని ప్రజలు మండిపడుతున్నారు.
కడప: పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బ్రహ్మంగారి మఠానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు STI విజయమ్మ తెలిపారు. మైదుకూరు నుంచి మిట్టమానపల్లె మీదుగా 8 సర్వీసులు, మల్లేపల్లి మీదుగా 16 సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కడప: YVU పరిధిలోని డిగ్రీ కళాశాలల బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, ఒకేషనల్ 2, 4, 6 సెమిస్టర్లకు సంబంధించి ఈ నెల 7న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్వీ కృష్ణారావు సోమవారం తెలిపారు. ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఐసెట్ పరీక్ష ఉన్నందున ఉన్నత అధికారుల మార్గదర్శకం మేరకు వాయిదా వేసినట్లు చెప్పారు.
KDP: అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది మరణించడం బాధాకరమని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అనారోగ్యంతో మరణించిన హోంగార్డు ఎస్.రఘు వర్మ (HG 486) సతీమణి కె.విజయ మేరికి కారుణ్య నియామకంలో హోంగార్డు నియామక పత్రాన్ని సోమవారం కడపలో అందజేశారు. పోలీస్ శాఖ అన్ని విధాల అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
కడప: బద్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో ప్రభుత్వ భూములను జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సోమవారం పరిశీలించారు. కలసపాడు, కాశి నాయనబి. కోడూరు, పోరుమామిళ్ల, బద్వేలు మండలంలో ఆర్డీవో చంద్రమోహన్తో కలిసి స్థలాల వివరాలపై చర్చించారు. కార్యక్రమంలో అన్ని మండలాల ఎమ్మార్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
బాపట్ల: జిల్లాలో రాబోయే రెండు మూడు గంటల్లో ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని కలెక్టర్ జె.వెంకట మురళి హెచ్చరించారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. పిడుగుల ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రధాన కేంద్రాల్లో ఉండాలని ఆదేశించారు.
అనంతపురం: ధర్మవరం రూరల్ పరిధిలోని గరుడంపల్లి క్రాస్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్న చిన్న గాయలతో ప్రయాణికులు బయట పడ్డారు. ఢీ కొన్న కార్లు కొత్తచెరువు, పుట్టపర్తికి చెందినవిగా గుర్తించారు. క్షతగాత్రులను ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కడప: మండలంలోని వంతాటిపల్లి గ్రామంలో వేరుశనగ విత్తన శుద్ధి ప్రాముఖ్యతపై గ్రామీణ అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు రైతులకు వివరించారు. కిలో విత్తనానికి ఒక గ్రాము మ్యాంగో జెబ్, 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి మందును పట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.