KRNL: పోలీసు శాఖ యాంటీ ఈవ్ టీజింగ్ బీట్‌లను ప్రత్యేకంగా తనిఖీ చేస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం ఈవ్ టీజింగ్, ఆకతాయి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో బీట్లు నడుపుతూ విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారు.
GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన పలు అంశాలపై స్పందించి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
VZM: రైల్వే లోకో పైలెట్లపై పని భారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు. బొబ్బిలి సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. లోకో పైలెట్లకు విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా పని చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, తక్షణమే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కృష్ణా: బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణము, ఆధునికీకరణ చేయు పనులకు శంఖుస్థాపన కార్యక్రమంలో గురువారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే డిగ్రీ కళాశాలకు 5 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.
AKP: పోషణ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం గొలుగొండ ఐసీడీఎస్ పరిధిలో ఉన్న గొలుగొండ, నాతవరం మండల అంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీడీపీవో శ్రీగౌరి పోషణ పక్షోత్సవాల్లో ముఖ్యమైన అంశాలను అంగన్వాడీలకు వివరించారు. అలాగే ప్రతి ఒక్క బాలింతకు, గర్భిణీలకు అవగాహన కల్పించాలన్నారు.
KDP: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించవద్దని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రవిశంకర్ రెడ్డి అన్నారు. గురువారం మరియాపురం వద్ద ఉన్న ఆ బ్యాంకు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రాయలసీమలో ఉన్న అనేక సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించి కరువు ప్రాంతంగా మార్చారన్నారు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగా భవాని అమ్మవారి 33వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా 18న అమ్మవారికి మధ్యాహ్నం 3 గంటలకు లక్ష కుంకుమార్చన, 19న నవగ్రహ చండీ హోమం, అన్నసంతర్పణ, 20న బోనాలు ఉంటాయన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.
TPT: తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం పరిశీలించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసపురం, ఓటేరు, పద్మావతిపురం, వేదాంతపురం పంచాయతీలలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేదాంతపురంలో మరో రెండు నీటి బోర్లు వేసి నీటి సమస్యను అధిగమించాలన్నారు.
ELR: ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ద్వారా మహిళలు స్వశక్తి పై జీవించాలని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. గురువారం ఉంగుటూరు పాత సచివాలయం వద్ద ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా సెంట్రల్ డిజిటల్ లైబ్రరీని గురువారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ఆ లైబ్రరీలో అందుబాటులో ఉన్న సాంకేతికతలు, సేవలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ లైబ్రరీలను అభివృద్ధి చేయడానికి ఈ అనుభవాలు ఉపయోగపడతాయని అన్నారు.
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 15వ వార్డు గణేష్ నగర్ ,బైరెడ్డి వారి వీధిలో గురువారం శానిటేషన్ సెక్రెటరీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సెక్రటరీ మాట్లాడుతూ.. కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ ఆదేశాల మేరకు శానిటేషన్ పనులు చేపట్టారు. ఈ పనులను వార్డ్ టీడీపీ నాయకులు పి. రమణ పర్యవేక్షించారు.
SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన ఓ చిన్నారి చిన్నతనంలోనే రెండు కిడ్నీలు పోవడం బాధాకరమని నందన్ కృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు గోపాల్ ఉర్లాన తెలిపారు. ఆయన గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తోటి విద్యార్థులు ఆ పిల్లవాడిని ఆదుకున్న తీరు ప్రశంసనీయమని అన్నారు.
కోనసీమ: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కలెక్టరేట్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తామని జేసీ నిశాంతి తెలిపారు. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ విషయాలకు సంబంధించి ఫిర్యాదులను కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో పరిష్కరిస్తామన్నారు.
KKD: ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా జిఏవిఎస్‌వి ప్రసాద్ ఎన్నికయ్యారు. కాకినాడ గాంధీభవన్‌లో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. 146 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో ప్రసాద్ 12 ఓట్ల మెజార్టీతో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షున్ని మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ అభినందించారు.
KRNL: జిల్లాలో 672 వార్డు, గ్రామ సచివాలయాలు ఉండగా.. నేటి నుంచి 31 కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈవో నాసరరెడ్డి తెలిపారు. జిల్లాలో 134 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ కేంద్రాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆధార్ నమోదుకు ప్రజల తాకిడి ఎక్కువ అయినందున ఆధార్ కేంద్రాలను పెంచినట్లు స్పష్టం చేశారు.