ప్రకాశం: చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అందరూ చెబుతున్నారే తప్ప ఎవ్వరూ ఆచరించడం లేదని CM చంద్రబాబు వద్ద ఓ విద్యార్థిని అసహనం వ్యక్తం చేసింది. స్టేజ్‌పై ఆమె మాట్లాడుతూ.. కందుకూరుకు నేడు(శనివారం) CM వస్తున్నారని అధికారులు చెత్తను తొలగించారేగాని ప్రతి రోజూ ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని ఆమె వాపోయింది.
PPM: రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి టీ.దుర్గా ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు హెల్మెట్ పెట్టుకున్న వాహనదారులకు కీ చైన్లు అందించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రావు మాట్లాడుతూ తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించుకోవాలని అవగాహన కల్పించారు.
PPM: జిల్లాలో పదవ తరగతి చదివే విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. కొందరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నట్లు గురువారం నిర్వహించిన పల్లె నిద్రలో గమనించడం జరిగిందని అన్నారు.
ప్రకాశం: గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ నిషా కుమారి అడవికి నిప్పు పర్యావరానికి ముప్పు అనే శీర్షికతో అడవులపై అవగాహన కల్పించే గోడపత్రాన్ని విడుదల చేశారు. ఎండాకాలం సమీపిస్తున్న సమయంలో అడవులలో ఎండు గడ్డి రాలుతుందని పొరపాటున కూడా నిప్పు పెట్టరాదు అన్నారు. అడవికి నిప్పు పెడితే గ్రామాల వరకు వ్యాపించి పర్యావరణానికి మానవులకు ముప్పు కలుగుతుంది.
ప్రకాశం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా చెప్పారు. ఒంగోలులోని రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సభలో శనివారం కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనాల చోదనలో ఎక్కువమంది నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు.
PPM: జిల్లాలో గృహాల నుంచి సేకరిస్తున్న చెత్త నుంచి సంపదను సృష్టించే దానిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి, వర్మి కంపోస్టుల ద్వారా సంపద సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. దీనికి ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు బాధ్యత వహించాలని కలెక్టర్ సూచించారు.
VZM: జిల్లాలో కౌలు కార్డు కలిగిన ప్రతి కౌలు రైతుకు రుణాలు మంజూరు చేయించే లక్ష్యమని కలెక్టర్ అంబేద్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం ఇప్పటికే ఫిబ్రవరి 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించామన్నారు. 126 మంది కౌలు రైతులకు రుణాలు ఇచ్చామన్నారు.
VZM: APSRTC విజయనగరం డిపోలో శనివారం రోడ్డు బధ్రతా మాసోత్సవాల ముగింపు సభను నిర్వహించారు. సందర్భముగా DPTO సీహెచ్.అప్పలనారాయణ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం, ఎస్. కోట డిపోలో ఎక్కువ కాలం ప్రమాద రహిత డ్రైవర్స్‌గా ప్రతిభ కనపరిచిన డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందచేశారు.
KKD: సీఎం చంద్రబాబును కాకినాడ జేఎన్టీయూ గ్రంథాలయ విభాగాధిపతి దొరస్వామి నాయక్ శనివారం కలిశారు. తనకు అన్ని అర్హతలు ఉన్నా కేవలం గిరిజనుడని ప్రొఫెసర్ హోదా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు దొరస్వామి తెలిపారు.
కోనసీమ: నకిలీ వీసా మోసాలను అరికట్టాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను కలిశారు. ఈ మధ్య కాలంలో విదేశాల్లో పనుల పేరుతో దళారుల చేతుల్లో చాలా మంది మోసపోతున్నారని.. అమరావతిలో ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయనను కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ. 38,02,281 ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించారు.
కోనసీమ: అమలాపురం పట్టణ పరిసర ప్రాంతాల్లోని పంచాయతీలకు చెందిన చెత్తా చెదారాలను అమలాపురం డంప్ యార్డ్‌కు తరలించి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో మున్సిపల్, ఎంపీడీవోలు, EOPRDలతో ఆయన సమావేశం నిర్వహించారు.
కోనసీమ: జిల్లాలో బర్డ్ ఫ్లూపై కలెక్టరేట్లో శనివారం పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయన్నారు. వాటిలో 24 లక్షల కోళ్లు ఉన్నాయని తెలిపారు. 41 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ASR: 516 జాతీయ రహదారి విస్తరణలో పాడేరు మోదకొండమ్మ ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని పెసా కమిటీ ప్రతినిధులు సల్లా రామకృష్ణ, బోనంగి రామన్న శనివారం కోరారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ క్రమంలో విస్తరణలో మోదకొండమ్మ ఆలయం కొంతభాగం పోతుందని తమకు సమాచారం ఉందన్నారు. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ATP: గుత్తిలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణం ప్రధాన రహదారి మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో గుత్తి సీఐ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం ట్రాఫిక్ రద్దీగా ఉండే సర్కిల్లో పోలీసులను నియమించారు.