• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లా యువత వీటికి దూరంగా ఉండండి: ఎస్పీ

విజయనగరం: ఐపీఎల్ సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా యువత ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్రావు సూచించారు. బెట్టింగ్ యాప్‌లో అప్పులపాలు చేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే 100కు ఫోన్ చేయాలని కోరారు.

March 28, 2026 / 10:13 AM IST

కంబగిరి బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

NDL: అవుకు కొండల్లోని కంబగిరి స్వామి ఆలయంలో ఈనెల 29 నుంచి ఏప్రిల్ 3 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆలయ ఈవో రామకృష్ణ శుక్రవారం ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాల వివరాలు వివరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.

March 28, 2026 / 10:06 AM IST

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అరకు ఎంపీ నిధులు

NLR: కోవూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని అరకు ఎంపీ తనూజా రాణిని శనివారం వైసీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోరారు. ఆమె సానుకూలంగా స్పందించి రూ. 10 లక్షల నిధులు కేటాయించారు. దీనిపై ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు. కొడవలూరులో ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.

March 28, 2026 / 10:05 AM IST

వేలూరులో కార్డెన్ సెర్చ్

PLD: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేట మండలం వేలూరులో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. DSP హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలతో పాటు, అనధికారికంగా ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు DSP తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామన్నారు.

March 28, 2026 / 10:05 AM IST

నేడే రాజంపల్లి ఆంజనేయస్వామి తిరునాళ్లు

ప్రకాశం: దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామంలో శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవం నేడు జరగనున్నది. తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుణాల సందర్భంగా మూడు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేస్తన్నారు.

March 28, 2026 / 10:05 AM IST

ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలి: కమిషనర్

KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి పన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మొండి బకాయిదారుల వివరాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాలని సూచించారు.

March 28, 2026 / 10:03 AM IST

ఆకివీడు ఆలయం వద్ద కంచె.. మోహరించిన బలగాలు

W.G: ఆకివీడు పెదపేటలోని శిథిలావస్థకు చేరిన ఆలయం వద్ద శ్రీరామనవమి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా, భక్తులు లేదా ఇతర వ్యక్తులు ఎవరూ ఆలయం లోపలికి వెళ్లకుండా అధికారులు ఆలయం చుట్టూ ఇనుప కంచె (ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఈ ప్రాంతంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది.

March 28, 2026 / 10:02 AM IST

తుంగభద్రలో నలుగురు మృతి.. ఎంపీ దిగ్భ్రాంతి

KRNL: కోసిగి మండలం కందుకూరు సమీప తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు కర్ణాటక వాసులు మృతి చెందడంపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి మృతదేహాలను స్వస్థలాలకు తరలించాలన్నారు. పెళ్లికి వచ్చి ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని శుక్రవారం ఎంపీ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

March 28, 2026 / 10:02 AM IST

కలకత్తాలో ఉగాది అవార్డు అందుకోనున్న ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ నెల 29న కలకత్తాలో ఉగాది విశిష్ట పురస్కారం అందుకోనున్నారు. కలకత్తా ఆంధ్ర సంఘం వారి 90 వసంతాల తెలుగు వెలుగులు పురస్కరించుకొని ఆయనకు ఈ పురస్కారం అందించనున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తులలో ఒకరిగా, సాంస్కృతిక విద్యా రంగాల్లో చేస్తున్న కృషి, తెలుగు భాషా వికాసానికి అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపు లభించింది.

March 28, 2026 / 10:00 AM IST

నకిలీ టికెట్ల వ్యవహారంలో ఇద్దరి అరెస్ట్

ELR: ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రంలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అవుట్‌సోర్సింగ్ సిబ్బంది శేషుబాబు,సెక్యూరిటీ గార్డు సతీశ్‌ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడు రాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో 61 నకిలీ టికెట్లు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

March 28, 2026 / 10:00 AM IST

కొత్త వీసీకి ఎన్నో సవాళ్లు

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీగా జ్యోతికుమార్ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 20 నెలల ఇన్‌ఛార్జ్ పాలన తర్వాత వస్తున్న రెగ్యులర్ వీసీకి ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయి. అధ్వానంగా ఉన్న వసతిగృహాలు, ఉద్యోగుల గైర్హాజరు, దూరవిద్య కేంద్రం నిర్వీర్యం, సర్టిఫికెట్ల జారీలో జాప్యం వంటి సమస్యలపై కొత్త వీసీ దృష్టి సారించాల్సి ఉంది.

March 28, 2026 / 09:59 AM IST

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రపై అవగాహన

VSP: జాలరిపేటలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తను వేరు చేయడంపై శనివారం ప్రజలకు అవగాహన కల్పించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటి నుంచే చెత్తను వర్గీకరించి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు పేర్కొన్నారు.

March 28, 2026 / 09:39 AM IST

పెద్దాపురంలో ఫ్లెక్సీల కలకలం

KKD: పెద్దాపురం మహారాణి సత్రం వద్ద ఈవో శ్రీనివాస్ ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు రంగనాగ్ ఫోటోను వేసి, ఆయనను ఏకంగా ‘ఎమ్మెల్యే’గా పేర్కొనడం గందరగోళానికి దారితీసింది. నేతల మెప్పుకోసమే ఈవో ఇలాంటి తప్పులు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

March 28, 2026 / 09:36 AM IST

చింతలపూడి ఎత్తిపోతల పరిహారం విడుదల

E.G: చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద రావలసిన పరిహారం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు తుపాకులగూడెం రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో మన్యాల సర్వారాయుడుకి రూ. 35 లక్షలు, మన్యాల చినగంగరాజుకు రూ. 36 లక్షల పరిహారం విడుదలైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించినందుకు బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

March 28, 2026 / 09:33 AM IST

కత్తి రామాంజులు రెడ్డికి ‘హ్యాట్రిక్’ అవార్డు

ATP: సోషల్ మీడియాలో చురుగ్గా పనిచేస్తున్న తాడిపత్రి టీడీపీ కార్యకర్త కత్తి రామాంజులు రెడ్డి అరుదైన గుర్తింపు పొందారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వరుసగా మూడోసారి ఉత్తమ కార్యకర్త అవార్డును ఆయన దక్కించుకున్నారు. శనివారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి చేతుల నుంచి ప్రశంసాపత్రం, పార్టీ చిహ్నాన్ని అందుకున్నారు.

March 28, 2026 / 09:29 AM IST