E.G: చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద రావలసిన పరిహారం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు తుపాకులగూడెం రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో మన్యాల సర్వారాయుడుకి రూ. 35 లక్షలు, మన్యాల చినగంగరాజుకు రూ. 36 లక్షల పరిహారం విడుదలైంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించినందుకు బాధితులు హర్షం వ్యక్తం చేశారు.