PLD: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేట మండలం వేలూరులో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. DSP హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలతో పాటు, అనధికారికంగా ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు DSP తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామన్నారు.