ASR: కొయ్యూరు మండలంలో 7,436 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్దిదారులకు గాను రూ.3,12,01,500 సొమ్ము మంజూరైనట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు బుధవారం తెలిపారు. ఈనెల 31వ తేదీన పెన్షన్ సొమ్మును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించారు.
BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 27న జిల్లాలో పర్యటించనున్నారు. జే.పంగులూరు మండలంలోని రామకూరు గ్రామంతో పాటు, కొరిశపాడు మండలంలోని పీ.గుడిపాడు, కుర్రావానిపాలెం గ్రామాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని, స్థానిక సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.
PLD: సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరై ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు ఈ టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు. పశువుల రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
KRNL: ఐపీఎల్ మ్యాచ్‌లను ఆసరాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బెట్టింగ్ నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహించినా లేదా పాల్గొన్నా, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
NTR: గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నందు ఫిబ్రవరి 11 నుంచి 25 వరకు భక్తులు కానుకలు సమర్పించారు. కాగా, దేవాలయ అధికారులు సమక్షంలో గ్రామ పెద్దలు, తదితరులు ఆరు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. దీంతో రూ.15.17 లక్షల ఆదాయం రాగా, వెండి 129 గ్రాములు, పది ఆస్ట్రేలియా డాలర్లు వచ్చాయన్నారు.
AKP: డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎన్.సీ.వో.ఆర్.డీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలపై సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలియజేయలన్నారు. అలాగే, అనకాపల్లిని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలన్నారు.
W.G: నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ జి.శివయ్య బుధవారం సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. వార్షిక ఆదాయం, రిజిస్ట్రేషన్ల విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భీమవరం పరిధిలోని 15 కార్యాలయాల ద్వారా ఈ నెల 23 నాటికి రూ.425 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం విధుల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
CTR: చిత్తూరులో బుధవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ‘మై భారత్ కేంద్రం వారు కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. భారతదేశానికి విలువైన సంపద యువతే అని అన్నారు. ఈ క్యాక్రమంలో 132 మంది కాశ్మీరీ యువత పాల్గొన్నారు.
SKLM: పోలాకి మండలంలోని పలు గ్రామాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే రమణ మూర్తి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పంచాయతీలకు చెత్త సేకరణ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్య మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
NTR: రైతులు వైవిధ్య పంటల సాగుతో సుస్థిర వ్యవసాయానికి బాటలు వేసి అధిక దిగుబడి, నికరాదాయం పొందాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సూచించారు. గుంటుపల్లిలో రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో నీరు ఉన్న నేపథ్యంలో మే 15 నుంచి ముందస్తు సాగు మొదలు పెట్టాలని కోరారు.
VZM: జిల్లాలో గృహల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులని ఆదేశించారు. ముఖ్యంగా లేఅవుట్లపై దృష్టి పెట్టాలని, లబ్ధిదారులను చైతన్య పరిచి అసంతృప్తిగా ఉన్న సుమారు 17,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు కృషి చేయాలని చెప్పారు. లబ్ధిదారులతో ప్రతి శనివారం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
KDP: సింహాద్రిపురంలో ఓ ఇంటి ముందర గ్యాస్ సిలిండర్‌కు వినియోగదారుడు గొలుసు తాళం వేశాడు. గ్యాస్ సిలిండర్లు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సోమవారం సింహాద్రిపురానికి గ్యాస్ సరఫరా అయ్యేది. పది రోజులుగా సిలిండర్లు రాకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియక గేటుకు సిలిండర్ను కట్టేసి ఉంచారు.
KKD: దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ రాజ్యసభలో తెలిపారు. ఎంపీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. మహిళల భద్రత, ఆర్థిక సాధికారత, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి సారిస్తున్నామని ఆయన వెల్లడించారు.
కోనసీమ: భద్రాద్రి రాములోరి దివ్య కళ్యాణ మహోత్సవానికి మండపేట నుంచి కళ్యాణం కొబ్బరి బొండాలు తరలి వెళ్లనున్నాయి. మండపేట కు చెందిన కాజులూరి వెంకట అచ్యుత రామ రెడ్డి మహాలక్ష్మి దంపతులు ఈ కొబ్బరి బొండాలు భద్రాచలం వెళ్ళి స్వామి వారికి సమర్పిస్తారు. 26 ఏళ్లు నుండి ప్రతి శ్రీ రామ నవమి నాడు స్వామి వారి కళ్యాణంకు ఇక్కడ నుండి బొండాలు తీసుకు వెళ్ళి ఇస్తారు.
E.G: రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి తన భర్త డా.దగ్గుబాటి వెంకటేశ్వరరావు బుధవారం ప్రధానమంత్రి మోడీని కలిశారు. వాజ్ పేయితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారతదేశ తరఫున మాట్లాడిన అంశాలను మోదీకి తెలిపారు. రచించిన “The Glimpses of World History” అనే పుస్తకాన్ని మోదీకి అందజేశారు. ప్రపంచ చరిత్రపై గ్రంథాన్ని రచించినందుకు ప్రధాని అభినందించారు.