KRNL: ఆదోని మండలం బసాపురం గ్రామంలో బుధవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు హాజరయ్యారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిని రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం, సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలపై అవగాహన కల్పించారు. రైతు సంక్షేమమే లక్ష్యమని నాయకులు తెలిపారు.
PLD: పిడుగురాళ్ల మండల పరిధిలోని కామేపల్లి గ్రామంలో హెల్త్ క్లినిక్ సెంటర్‌ను మెడికల్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సౌరబ్ గౌర్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో హెల్త్ క్లినిక్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందిస్తారు అన్నారు.
GNTR: పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన వివిధ మార్కెట్ల వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు బుధవారం తెలిపారు. కూరగాయల మార్కెట్, సండ్రీ మార్కెట్, మాంసము మార్కెట్, చేపల మార్కెట్, జంతు వధశాలలకు వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
CTR: ఇటీవల మృతి చెందిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే టి.సి.రాజన్ (104) చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజకీయాలంటే కేవలం సేవే గాని సంపాదన కాదని.. నీతి, నిజాయితీలే ఆభరణాలుగా తన శేషజీవితాన్ని నిరాడంబరంగా గడిపిన రాజన్ తనకు ఆదర్శమని ఆయన తెలిపారు.
TPT: నాగలాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణిగా మూడి శ్రీతేజస్విని బధవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 ద్వారా ఎంపికై నాగలాపురం మండలంలో మొదటిసారిగా ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి: మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషితోనే ఆర్డీటీ ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరణ సాధ్యమైందని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ సంస్థను నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు క్రెడిట్ కోసం జగన్ ట్వీట్ చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు.
VZM: జనాభా లెక్కల కార్యక్రమంపై పూర్తి అవగాహనతో పని చేయాలని కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో గృహాల లెక్కింపు, రెండవ దశలో వచ్చే ఏడాది జనాభా గణన జరుగుతుందని తెలిపారు.
ప్రకాశం: కంభంలోని గ్యాస్ గోడౌన్లలో బుధవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా నిబంధనలు, అగ్నిమాపక సదుపాయాలు, సిలిండర్ల నిల్వ, రవాణా విధానాలను పరిశీలించారు. గోడౌన్ యజమానులు అన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని సీఐ మల్లికార్జున హెచ్చరించారు. గ్యాస్ కొరతను సృష్టిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
VZM: రైతులు లాభదాయకమైన పంటలు వేసుకోవాలని గజపతినగరం మండల వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ కోరారు. బుధవారం గజపతినగరం మండలంలోని తుమ్మికాపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి సమగ్రంగా వివరించారు.
ATP: రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో దినసరి కూరగాయల మార్కెట్, వారపు సంత రుసుం వసూలు హక్కుల కోసం బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో మల్లికార్జున అనే వ్యక్తి హక్కులను దక్కించుకున్నారు. దినసరి మార్కెట్‌ను రూ.31.70 లక్షలకు, వారపు సంతను రూ.11.50 లక్షలకు ఆయన పాట పాడి సొంతం చేసుకున్నారు.
అన్నమయ్య: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబటి రాంబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తానేటి వనిత, తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ వడ్డే రఘురాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
NLR: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయనను కలిసిన వేమిరెడ్డి దంపతులు రాజ్‌నాథ్ సింగ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. మంత్రికి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు అందజేశారు.
VZM: ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శ్రీనివాస్ అన్నారు. బుధవారం బొండపల్లి మండలంలోని గొల్లుపాలెం గ్రామంలో ఉపాధి పర్యటనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా వేతనదారులు సమస్యలను వారికి వివరించారు. ఉపాధి చట్టాన్ని రక్షించుకోవడానికి పోరాటానికి సిద్ధం కావాలన్నారు.
BPT: బాపట్ల మండలం బేతపూడిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ స్వామి వారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణంలో గ్రామ ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.