VSP: జాలరిపేటలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తను వేరు చేయడంపై శనివారం ప్రజలకు అవగాహన కల్పించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటి నుంచే చెత్తను వర్గీకరించి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు పేర్కొన్నారు.