అన్నమయ్య: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భద్రత కట్టుదిట్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.