E.G: రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలో శనివారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు పండగ విశిష్టతను మత గురువులు వివరించారు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కాగా సంప్రదాయ దుస్తులను ధరించి చిన్నారులు సందడి చేశారు.
NDL: ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. గత వారం జిల్లాలో ఒక్క గుడ్డు రూ.6.50కు పైగా ఉండగా, ప్రస్తుతం రూ.4.50కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఈ పరిణామం జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
W.G: తాడేపల్లిగూడెంలోని పాతూరు మసీదు సమీపంలోని ఖబరిస్తాన్ (స్మశాన వాటిక) అభివృద్ధికి రూ.2 లక్షలు ఇస్తానని ఫిబ్రవరి 13న జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు హామీ ఇచ్చారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద మసీదు కమిటీకి ఆ నగదు అందచేశారు. అనంతరం వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
KDP: ఒంటిమిట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (19) అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయి ఆ తర్వాత కనిపించలేదని తెలిపారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై శ్రీనివాసులు వెల్లడించారు.
W.G: ఉమ్మడి పశ్చిమ వాసులకు గుడ్ న్యూస్. కోడిగుడ్డు ధర అమాంతంగా పడిపోయింది. జిల్లాలో గుడ్ల స్టాకు లక్షల్లో పేరుకు పోయింది. పౌల్ట్రీలలోనే కోడిగుడ్ల స్టాక్ నిల్వ ఉండిపోయింది. దీంతో ధర అమాంతంగా పడిపోయింది. ఇరాన్-ఇరాక్ యుద్ధం నేపథ్యంలో విదేశాలకు గుడ్లు ఎగుమతి లక్షల్లో నిలిచిపోయాయి. పౌల్ట్రీ రైతులు తక్కువ రూ.130కే విక్రయిస్తున్నట్లు తెలిపారు.
ATP: బెళుగుప్ప మండలం దూదేకుంట గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను రైతు సంఘం నాయకులు శనివారం పరిశీలించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించిన రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.
TPT: సూళ్లూరుపేట మండలంలోని కోరిడి గ్రామంలో బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు దెబ్బతినడం, గోడలు కూలిపోవడం వల్ల ప్రయాణికులు అక్కడ నిలబడేందుకు కూడా భయపడుతున్నారు. వర్షం, ఎండ నుంచి రక్షణ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ చుట్టూ చెత్త పేరుకుపోయి, మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి.
W.G: ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం నరసాపురంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మిషన్ హైస్కూల్ రోడ్డులో ఉన్న ఈద్గా మైదానానికి ముస్లింలు, పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి: కదిరి పట్టణం ఈద్గా మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో సోదరభావం, శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పండుగ పూట ముస్లిం సోదరులతో కలిసి సమయం గడపడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అన్నమయ్య: సంబేపల్లిలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నెలరోజులు ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు చివరి రోజు ఈద్గా వద్దకు వెళ్లారు. అందరూ కలిసి ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు దానధర్మాలు చేశారు.
ELR: రేపు ఉదయం 10 గంటలకు ఏలూరులోని యూటీఎఫ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఇవాళ తెలియజేశారు. ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలూరులో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జూన్ 3, 4, 5 తేదీలలో నిర్వహిస్తున్నామన్నారు.
KDP: కొండాపురం మండలంలోని 67 జాతీయ రహదారిలో ఉన్న వెంకటాపురం సీతారామయ్యస్వామి ఆలయానికి 116 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయాన్ని 1910లో ఒక భక్తుడు నిర్మించాడు. ఈ నెల 27న శ్రీరామనవమి పండగ పర్వదినం సందర్భంగా.. పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు పానకం, వడపప్పు వితరణ, రామ భజనలు ఈ ప్రాచీన ఆలయంలో జరగనున్నట్లు స్థానికులు తెలిపారు.
NTR: విజయవాడ మధురానగర్ నేతాజీ కాలనీలో నివాసం ఉంటున్న బుక్త జ్యోతి ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని, గత కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతూ,సరిగ్గా చూడలేకపోతున్నానని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, జ్యోతికు అవసరమైన కళ్ళజోళ్లను శుక్రవారం ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLR: కందుకూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అన్నారు. ఈద్ పండుగ అందరి ఇంట కొత్త వెలుగులు తీసుకురావాలని, అల్లాహ్ దీవెనలతో ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలన్నారు. రంజాన్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.