కృష్ణా: శాంతినగర్‌లో మంగళవారం మహిళా పోలీస్ అధికారి మల్లెల విజయలక్ష్మి, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ అవగాహన ర్యాలీ జరిగింది. విజయలక్ష్మి మాట్లాడుతూ.. క్రమశిక్షణ, మంచి నడవడికతో బాలికలు చదువుకోవాలన్నారు. సోషల్ మీడియా ఆకర్షణకు గురికావొద్దని సూచించారు. బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందన్నారు.
CTR: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అన్నారు. చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అర్హులందరికీ పథకాలు అందించడానికి తాము కృషి చేస్తామన్నారు.
NTR: ప్రజలపై మోపిన ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని ఎమ్మెల్సీ రూహుల్లా డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేఎల్ రావు పార్క్ వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే పెంచిన ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
SKLM: త్రాగునీటి కొళాయిలకు నీళ్లు విడిచి పెట్టే సమయంలో మోటార్లు బిగిస్తే ఇంటి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమదాలవలస పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ వార్డుల్లో త్రాగునీటి కొళాయిలకు మోటర్లు బిగించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంద అన్నారు.
SKLM: వేసవి తాపం అధికంగా ఉన్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్లో మెడిటేరియన్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరం నిమిత్తం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.
VSP: గాజువాక అగనంపూడిలో మేడ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. శ్రీ వైష్ణవి అపార్ట్మెంట్లో ఉంటున్న గుడ్ల కమలకుమారి టెర్రస్ పై నుండి దూకి గేటు పై పడి అక్కడికక్కడే మృతి చెందింది. దువ్వాడ పోలీసులు స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
VSP: విజిలెన్స్ కమిషనర్‌కు జనసేన నేత, జీవీఎంసీ కార్పొరేటర్ పీతలు మూర్తి యాదవ్ మంగళవారం లేఖ రాశారు. పర్యాటక శాఖ ప్రసాద్ పథకంలో నిధుల దుర్వినియోగం వల్లే సింహాచలంలో భక్తులు చనిపోయారని ఆయన లేఖలో సంధించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
SKLM: నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో మంగళవారం శ్రీఅసిరి తల్లి గ్రామ దేవత పండగలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. గ్రామంలో ఉన్న పలు కుటుంబాలను కలిసి మాట్లాడారు.
ATP: అనంతపురం నగరంలో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కేంద్రాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తనిఖీ చేశారు.ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సిబ్బందికి సూచించారు.
NLR: కొడవలూరులోని గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా మంగళవారం హాజరైన విద్యార్థులు చేత గ్రంథాలయ అధికారి రాజేశ్వరి ప్రతిజ్ఞ చేయించారు. పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంధాలయంలో ఉండే పుస్తకాలు చదవడం ద్వారా గొప్ప మేధావులు అవుతారని రాజేశ్వరి అన్నారు. ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.
NLR: దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ నేత, గతంలో కావలి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా మాలేపాటి సుబ్బానాయుడు విధులు నిర్వహించారు. టీడీపీ క్యాడర్‌కు, ప్రజలకు అండగా ఉన్న నేపథ్యంలో మాలేపాటిపై 16 కేసులు నమోదు అయ్యాయి. దాని పర్యవసానంగా మంగళవారం నెల్లూరు జిల్లా కోర్టుకు ఆయన హాజరయ్యారు.
NLR: పిల్లలకు తల్లిదండ్రులు, గురువులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు మంచి మాటలు చెప్పడం ద్వారా అనురాగం, అభిమానం, ఆత్మవిశ్వాసం ఏర్పడతాయని వెంకట సుబ్బారావు అన్నారు. బుచ్చి పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా “మంచి మాట.. జ్ఞాపకాల తోట” కార్యక్రమం నిర్వహించారు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మంచి మాటలను పిల్లలచే చెప్పించారు.
నెల్లూరులోని అయ్యప్ప గుడి సెంటర్లో మంగళవారం దారుణ హత్య చోటుచేసుకుంది. అయ్యప్ప గుడి సమీపంలోనీ రాయలసీమ రాగి సంగటి హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య (చిన్న)ను హత్య చేశారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ సింధుప్రియ, వేదయపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రావడం లేదని జలాశయ ఈఈ శ్రీనివాస కుమార్ తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా జలాశయంలో 50.706 నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 30, దక్షణ కాలువకు 30, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.