కృష్ణా: విజయవాడ 3టౌన్ పరిధిలోని లాడ్జీల్లో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లాడ్జీల నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన సీఐ నాగమురళి, బస చేసే వారి గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి గదులు కేటాయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
కృష్ణా: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి మంగళవారం ఒక్కరోజులో వివిధ సేవల ద్వారా రూ.9,15,853 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
కాకినాడ జిల్లా డీఎస్పీ మనీష్ దేవరాజ్ మంగళవారం రాత్రి రూరల్ సర్పవరంలోని శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం సందర్శించారు. ఈ నెల 8న నిర్వహించనున్న కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అదే విధంగా తెప్పోత్సవం వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్ల గురించి వివరించారు.
W.G: నిడదవోలులోని SVRK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12వ తేదీ నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. నిరుద్యోగులతో పాటు, గృహిణులకు కంప్యూటర్ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్, ఇంటర్నెట్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తామన్నారు. 16-38 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులన్నారు.
GNTR: అక్రమ మైనింగ్ కేసులో తీర్పు ఆలస్యం అయినప్పటికీ, నేరస్తులు మాత్రం తప్పించుకోలేరని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఓబులాపురం అక్రమ మైనింగ్‌పై 2004-2009 మధ్య టీడీపీ నేతృత్వంలో పోరాటం చేసిన తమకు నేడు ఫలితం దక్కినట్లు తెలిపారు. సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టెలివిజన్, ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్స్ కోర్సు కోసం మే 11వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ రైటింగ్‌లో శిక్షణ, ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్లుగా రూపొందించిన సిలబస్, ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఈ కోర్సు ప్రత్యేకతలు. ప్రవేశాలు APPGCET ద్వారా జరుగుతాయి. వివరాలకు cets.apsche.ap.gov.in చూడండి.
E.G: ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులోని 7 రకాల సేవలకు సంబంధించి బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని JC చిన్నరాముడు తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల తొలగింపు, కార్డు సరెండర్, చిరునామా మార్పు, ఆధార్ దిద్దుబాట్లకు అవకాశం కల్పించారన్నారు. సేవలను JSWS AP ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చన్నారు.
GNTR: జిల్లా క్రికెట్ సంఘం అండర్-23, సీనియర్ జట్ల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు మే 10న అరండల్‌పేటలోని పిచ్చుకులగుంట మైదానంలో ఉదయం 8 గంటల నుంచి అండర్-23 ఎంపిక పోటీలు జరుగుతాయి. అనంతరం మే 11న సీనియర్ జట్టు ఎంపికలు నిర్వహిస్తారు. క్రికెటర్లు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలు, వ్యక్తిగత క్రికెట్ కిట్‌తో హాజరుకావాలని GDCA సభ్యుడు మహతీ శంకర్ తెలిపారు.
VZM: గజపతినగరం మండలం ఎం. వెంకటాపురం గ్రామానికి చెందిన వి.హరీశ్ (30) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అరకులో ఉద్యోగం చేసేందుకు వెళ్లిన హరీశ్ గంట్యాడ మండలం కె. తామరపల్లి సబ్ స్టేషన్ వద్ద సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మహారాజా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు.
GNTR: విధుల్లో నిర్లక్ష్యం, పారిశుద్ధ్య పర్యవేక్షణ లోపంపై 8వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ రాంబాబుని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ఈనెల 5వ తేదీన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విధులకు హాజరు కాని పారిశుద్ధ్య సిబ్బందికి హాజరు వేసినట్లు గుర్తించి సస్పెండ్ చేశామన్నారు. ఇన్‌ఛార్జ్‌గా బాబును నియమించామని చెప్పారు.
కోనసీమ: రానున్న నాలుగేళ్ల కాలంలో కోనసీమ వాసులకు రైల్వే కూత వినిపిస్తామని ఎంపీ గంటి హరీష్ హామీ ఇచ్చారు. మంగళవారం ముమ్మిడివరం మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను MLA దాట్ల బుచ్చిబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. కొండాలమ్మ చింత నుంచి బాలయోగేశ్వరుల గుడి వరకు రూ.1.68 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును వారు ప్రారంభించారు.
పార్వతీపురం నుంచి కూనేరు మీదుగా రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. పెద్దపెద్ద గోతులతో దర్శనమిస్తోంది. ఈ రోడ్డులో ప్రయాణించేందుకు వాహనచోదకులు భయపడుతున్నారు. ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. మరోవైపు 1933లో జంఝావతి నదిపై కోటిపాం గ్రామ సమీపంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. పరిమితికి మించి వాహనాలు తిరుగుతున్నాయి.
పార్వతీపురం పట్టణంలో తాగునీటి కష్టాలు. పట్టణంలో పలు ప్రాంతాలకు ఒకసారి తాగునీరు విడిచిపెడుతున్నారు. శివారు కాలనీల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నేతలను నిలదీద్దాం అంటే కనిపించడంలేదని మహిళలు చెబుతున్నారు. బిందెడు నీటికోసం గంటలతరబడి నిలబడుతున్నారు.
కోనసీమ: పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు కార్యాలయ సిబ్బంది నిన్న రాత్రి వెల్లడించింది. బుధవారం ఉదయం 11: 30 గంటలకు అమలాపురం గ్రీన్ సిటీ వద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 12 గంటలకు నియోజవర్గంలో జరిగే పలు శుభకార్యాలకు హాజరవుతారు. 3 గంటలకు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.