KRNL: ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరిగిన దక్షిణ భారత స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల జట్టులో పాల్గొన్న పర్వేజ్, గౌతమ్ రాజు మొదటి స్థానం సాధించగా, బాలికల విభాగంలో కళ్యాణి మూడో స్థానంలో నిలిచారని సాఫ్ట్ బాల్ క్రీడా జిల్లా కార్యదర్శి విజయ్ తెలిపారు.
పల్నాడులోని ప్రసిద్ధి చెందిన ధర్మవరం శ్రీ హరిహర బాల నాగేంద్రస్వామి దేవస్థానంలో శివ ముక్కోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం నైవేద్య, నిరాజనాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు సుధాకర్ శాస్త్రి ఏర్పాట్లు పర్వేక్షించారు.
ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న నార్నె సురేశ్ అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు: ఉదయగిరి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు బోగినేని కాశీరావు, బోగినేని గాంధీ ఆదివారం రోజు విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నందు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరువురు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కొద్దిసేపు తాజా రాజకీయాలు పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
నెల్లూరు: అల్లూరు మండలంలోని పురిని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో భోగి పండుగ సందర్భంగా సోమవారం విశేష పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాలతో, వేద పండితుల నడుమ శ్రీ వీరాంజనేయ స్వామి వారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
పల్నాడు: భోగి పండుగ సందర్భంగా సోమవారం ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివార్ల గ్రామోత్సవం నిర్వహించారు. గరుడ వాహనంపై నిర్వహించిన స్వామివారి గ్రామోత్సవంలో అర్చకులు పాండు రంగాచార్యులు అర్చనలు చేశారు. గ్రామస్థులు మంగళహారతులు సమర్పించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్త సంఘాలు, మహిళా సంఘాలు, యువకులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
నెల్లూరు: దుత్తలూరు మండలం నర్రవాడలోని ప్రాచీన జనార్ధన స్వామి ఆలయ పునరుద్ధరణ ఉత్సవాలు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ మాదాల బాబురావు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి ఈ ఆలయం శిథిలావస్థకు చేరగా.. కోటి రూపాయల వ్యయంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరగనున్నట్లు ఆయన వివరించారు.
పల్నాడు: రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో వేంచేసియున్న వల్లభేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు పరమేశ్వరరావు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తీర్థ, ప్రసాదాలను భక్తులకు అందజేశారు.
KDP: త్రాగునీరు వృథా చేయవద్దని ప్రభుత్వం ప్రచారాల మేరకే తప్ప ఆచరణలో కానరావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. సిద్దవటం మండలంలోని మాధవరం-1 రెడ్డి వారి వీధి రోడ్ నెంబర్-16లో గత కొద్ది నెలలుగా మంచినీటి పైపు డామేజ్ కావడంతో రహదారి జలమయమై, ప్రజలు అవస్థలు పడుతున్నారు. వృథాగా పోతున్న త్రాగునీటిని అరికట్టి మరమ్మత్తులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
KDP: తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి నిలుస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు. సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి నిలుస్తుందన్నారు.
VSP: విశాఖ నగరం బీచ్ రోడ్డు వైఎంసీఏ వద్ద సోమవారం ఉదయం విశాఖ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లక్షా ఒక్క పిడకలతో భోగిమంట వేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
GNTR: మంగళగిరి బాపూజీ విద్యాలయంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచిన సమన్వితను చినజీయర్ స్వామి అభినందించారు. శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ కుమార్తె సమన్వితకు ఆదివారం చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేసి, సర్టిఫికెట్, శేష వస్త్రం అందజేశారు.
విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు విశాఖ జూను సందర్శించారు. దీంతో జూలో సందడి వాతావరణం నెలకొంది. సందర్శకుల ద్వారా ఆదివారం ఒక్కరోజు రూ.3.84 లక్షల ఆదాయం సమకూరినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించామన్నారు.
బాపట్ల: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పార్టీ నాయకులతో కలిసి భోగి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఆయన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల పట్టణంలోని శ్రీక్షీర భావనారాయణ స్వామి దేవాలయం దగ్గర భోగి మంటల చితిని ఎమ్మెల్యే వెలిగించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి సంప్రదాయాలను సంరక్షిస్తున్నటువంటి పండగలు సంక్రాంతి, భోగి అని అన్నారు.
పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర దంపతులు జీవితకాలం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈసందర్బంగా ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున సభ్యత్వ రుసుం చెల్లించి శాశ్వత సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. పేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీలో శాశ్వత సభ్యత్వం పొందడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు.