ATP: కర్నూలు జిల్లాకు చెందిన న్యాయవాది పవన్ కుమార్‌పై సీఐ విక్రమసింహా దౌర్జన్యం చేసినందుకు నిరసనగా తాడిపత్రి న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదుల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు.