SKLM: రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి సింహాచలం, అడపా శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారు సోమవారం శ్రీకాకుళం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.