VSP: ఈనెల 10, 11న ఏలూరులో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభల గోడపత్రికను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. తెలుగు భాషను కాపాడుకొనే ఇటువంటి సభా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెజెయఫ్ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.