GNTR: పొన్నూరు పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి ప్రక్కన సోమవారం గుర్తు తెలియని మృతదేహం (45) స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా అర్బన్ CI L. వీర నాయక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు ఎవరు, ఆత్మహత్యనా, హత్యనా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.