VSP: పెందుర్తిలో నిర్వహించిన సీపీఎం 24వ మహాసభలో 35 తీర్మానాలను ఆమోదించినట్లు పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు తెలిపారు. సోమవారం జగదాంబ సెంటర్ వద్ద గల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. విశాఖ నగరంలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ తదితర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ATP: గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీపురం గ్రామంలో రాజేష్ అనే యువకుడు సోమవారం ఉరి చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
KDP: యువతను సన్మార్గంలో నడిపించేందుకు డీవైఎఫ్ఎ నాయకులు కృషి చేయాలని అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ తెలిపారు. డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్లను స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో ఆయన విడుదల చేసి మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి, వివిధ అంశాలలో వారిలో చైతన్యం నింపేందుకు డీవైఎఫ్ఎ చేస్తున్న కృషి గొప్పదన్నారు.
ELR: అంబేద్కర్‌ని రాజ్యసభలో అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను పదవి నుండి వెంటనే బర్త్‌రఫ్ చేయాలనీ సిసీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. సోమవారం బుట్టాయగూడెంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ అనే కంటే శ్రీరాముని తలుచుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని మాట్లాడటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ను అవమానపరిచారన్నారు.
KRNL: ఎమ్మిగనూరు టీడీపీ MLA డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మిగనూరు ఎస్సైపై దాడి ఘటన, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఎంపీడీవోపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై ఎందుకు చర్యలు ఆలస్యం అవుతున్నాయి అని కర్నూలు ఎస్పీని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థలో విశ్వాసం పెంచండి అని బీవీ వ్యాఖ్యానించారు.
కడప: జమ్మలమడుగు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సభా భవనంలో మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ శివమ్మ అధ్యక్షతన జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యలు తప్పనిసరిగా హాజరు కావాలని జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
అన్నమయ్య: బి.ఆర్ అంబేద్కర్ భవనం నిర్మించాలంటూ బహుజన యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పునీత్ కుమార్ సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో రెడ్డప్ప నాయుడు కాలనీలోని సర్వే నెంబర్ 328లో 8 కుంటల స్థలం అంబేద్కర్ భవనం కోసం కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు.
VZM: అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే బర్త్ రఫ్ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు వి.లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గజపతినగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్‌ని అవమానించారని అన్నారు.
AKP: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం పరవాడ సినిమాలు జంక్షన్‌లో హోం మంత్రి అనుచిత వ్యాఖ్యలపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే హోంమంత్రికి రాజ్యాంగం మీద అంబేద్కర్ మీద గౌరవం లేదన్నారు.
KDP: వైసీపీ నాయకులకు 11 సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారని, ఆయనకు 2019లో ఒక్క సీటే వచ్చిన విషయం గుర్తు లేదా? అని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. 140 సీట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు పవన్ నోటికి తాళం వేస్తామని చెప్పారు.
GNTR: ఫిరంగిపురంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఫిరంగిపురం గ్రామంలో రామిశెట్టి మరియమ్మ పేరున 142/1 సర్వే నంబర్లో 80 సెంట్లు భూమి ఉండాల్సి ఉండగా, ఆన్‌లైన్‌లో చూడగా 142/1లో 46 సెంట్లు,141/1లో 34 సెంట్లు ఉందని అన్నారు. సమస్య పరిష్కరించాలని తహశీల్దార్‌కు అర్జీ అందజేశారు.
NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సూర్య తేజ పాల్గొని అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
PPM: పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ని సోమవారం ఉపవిద్యా శాఖాధికారి డీఈవో కృష్ణమూర్తి ప్రారంభించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల సృజనాత్మకత సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈవో ప్రధానోపాధ్యాయులు రవికుమార్, రత్న కుమార్, హేమసుందర్, అనంతకుమార్, నిర్వాహకులు బౌరోతు శంకరరావు పాల్గొన్నారు.
ATP: రాయదుర్గం పట్టణంలో సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో అమిత్ షాను హోమ్ శాఖ మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. స్థానిక వినాయక సర్కిల్ వద్ద సీపీఐ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అనుభవిస్తూ గొప్ప పదవిలో ఉన్న అమిత్ షా అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అన్నారు.
KKD: విద్యను మించిన సంపద లేదని, విద్య ద్వారానే దేశ ప్రగతి సాధ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సోమవారం కాకినాడ రూరల్ వాకాడలో జరిగిన గ్రీన్ ఫీల్డ్ స్కూల్ ఇంటర్నేషల్ 11వ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి సుభాష్ మాట్లాడారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచి విలువలతో కూడిన విద్య అందించాలని అన్నారు.