VZM: నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కతిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. 31వ రాత్రి బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, మద్యం సేవించి వాహనాలు, అల్లర్లలకు తావివ్వకూడదన్నారు. జిల్లా వ్యాప్తగా ప్రత్యేక గస్తీ, మద్యం సేవిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు.
కోనసీమ: మండపేట మండలం ఏడిద హైస్కూల్ వద్ద గల చేరువు గట్టు మీద గత కొన్నేళ్లుగా ఇళ్ళు నిర్మించుకొని ఉంటున్న తమను బలవంతంగా ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోయారు. మండపేట విజయలక్ష్మి నగర్‌లోని వైసీపీ కార్యలయంలో సోమవారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు తమ గోడు వినిపించారు. దశాబ్దాలుగా చేరువు గట్టుపై తాము నివాసిస్తున్నమని పేర్కొన్నారు.
ATP: పామిడి పట్టణములోని పెన్నా నది ఒడ్డున ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా ఆలయంలో అయ్యప్ప మాలదారులు షిర్డీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామివారి నామస్మరణతో ఆలయం మారుమొగింది. అయ్యప్ప మాలధారులు అధిక సంఖ్యలో ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
NDL: పట్టణానికి చెందిన కిరాణా మర్చంట్ అసోసియేషన్ సభ్యుడు గుండా జగన్ మోహన్ రావు కుమారుడు అశ్వర్థ నారాయణ బేతంచెర్ల బీజేపీ పట్టణ కన్వీనర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్యులు, బీజేపీ నాయకులు పట్టణ కన్వీనర్‌గా ఎన్నికైన గుండా అశ్వర్థ నారాయణను అభినందించారు.
VSP: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసిన అర్జీలను పరిశీలించి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయన సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.
ప్రకాశం: కొండేపి పోలీస్ స్టేషన్ ను కొండేపి సర్కిల్ సీఐ సోమశేఖర్ తనిఖీ చేశారు. సందర్భంగా స్టేషన్‌లోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా గంజాయి పేకాట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
E.G: రంగంపేట మండలం జి.దొంతమూరులో సోమవారం జరిగిన రీ సర్వే ప్రారంభోత్సవ ర్యాలీ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. రైతులు అందజేసిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తారన్నారు. రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కాకినాడ: పెద్దాపురం మండలంలోని చినబ్రహ్మదేవంలో సోమవారం కరెంట్ షాక్‌తో లారీ క్లీనర్ మృతి చెందారు. చేపల ట్రక్కులు లోడ్ చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ ఘటన చోటు చేసుకుందని పెద్దాపురం ఎస్సై మౌనిక సోమవారం తెలిపారు. ఈ ఘటనలో లారీ క్లీనర్ పెచ్చేటి నాగేశ్వరరావు (58) మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కోనసీమ: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జరుగుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో సోమవారం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి అర్జీదారులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల ఛైర్మన్, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు.
E.G: రాజమండ్రిలోని లాహస్పీన్ హోటల్లో రొయ్యల సాగుపై నాబార్డు ఆధ్వర్యంలో ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రాంతీయ అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం ఆర్ గోపాల్ పాల్గొని రైతులకు, ప్రొఫెసర్లకు పలు సూచనలు చేశారు. ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ లాల్ మొహమ్మద్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
TPT: గూడూరు మండలం గొల్లపల్లి సమీపంలో కనుమరాయకొండ పై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జనవరి ఒకటో తేదీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరోజు ఉదయం స్వామి వారికి విశేష అభిషేకాలు, పుష్పాలంకరణ పూజలు అనంతరం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
CTR: కుప్పం పట్టణంలోని రాధాకృష్ణ రోడ్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలతో అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగించారు. రోడ్డుపై దుకాణదారులు వస్తువులను ఉంచడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. స్పందించిన కమిషనర్ రోడ్డు ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
SKLM: అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించాలని పలాస వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ జిల్లా కార్యదర్శి సన్యాసి, సీపీఐ కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ.. పార్లమెంట్ వేదిక అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
CTR: సోమవారం చిత్తూరు నగరంలోని పొన్నియమ్మన్ వీధిలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆలయాల అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి, శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం హరే సముద్రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మడకశిర మాజీ వైస్ ఎంపీపీ కే.గోపాలప్ప ఆదివారం మృతి చేందారు. సమాచారం తెలుసుకున్న మడకశిర మాజీ శాసనసభ్యులు మద్దనకుంట ఈరన్న వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరితో పాటు మాజీ ఎంపీపీ అశ్వత్తామప్ప, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ప్రకాష్, నరసేగౌడ్, చత్రం శివరామకృష్ణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.