SS: మడకశిర పట్టణం RMB విశ్రాంతి భవనంలో మడకశిర విద్యుత్ శాఖ నూతన ఏడీ రఘు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలను కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, నాయకులు పాల్గొన్నారు.
KRNL: దేవనకొండ మండలంలోని హంద్రీనీవా పంట కాలువల్లో పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కాలువలో నీరు ముందుకు కదలకపోవడంతో తమ పంట పొలాలకు సక్రమంగా అందడంలేదని దిగువున సాగుచేస్తున్న రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలువలో మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించి సాగునీరు సక్రమంగా అందేటట్లు కృషి చేయాలని కోరుతున్నారు.
KRNL: జిల్లా సి. బెళగల్ మండలం పోలకల్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఇసుక టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పోలకల్‌కు చెందిన సోమప్పగా గుర్తించారు. సోమేశ్వరస్వామి ఆలయంలో పూజ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: గోనెగండ్ల మండలం బైలుప్పుల, అగ్రహారం, గంజహళ్లిలలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ గ్రామ కమిటీలను ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పసెద్ధుల మహదేవ్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్‌ను బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
NLR: కందుకూరు పట్టణంలోని శతాబ్దాల నాటి ప్రాచీన ప్రసిద్ధి అంకమ్మ తల్లి దేవాలయంలో ఈనెల 12వ తేదీ ఏకాహం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. పవిత్ర మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు (ఏకాహం) లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఏకాహంలో పాల్గొంటారని తెలిపారు.
Akp: చోడవరం గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కూటమి నాయకులు ఆ ఫ్యాక్టరీ విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డీ.వెంకన్న మంగళవారం ఆరోపించారు. ఫ్యాక్టరీ వద్ద చెరకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారన్నారు. సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని చెప్పారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామిని మంగళవారం సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజామనే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తికి పలు రకాల పుష్పాలు, తమలపాకుల తోరణాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
SKLM: టెక్కలిలోని అయ్య ప్పనగర్లో ఉన్న ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతిగృహాన్ని మంగళవారం ఉదయం టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహ పరిసరాలను పరిశీలించారు. వసతిగృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్డీవో సిబ్బందికి సూచించారు.
విశాఖలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. శ్రీకాకుళం (D) ఇచ్ఛాపురానికి చెందిన ఉషారాణి(22) స్నేహితుడు సిద్దూతో కలిసి ఓ ఫార్మా కంపెనీలో ఇంటెర్న్ చేసేది. ఉషారాణికి కొరియర్ రాగా సిద్దూతో కలిసి బైక్‌పై ఆటోనగర్ వెళ్లింది. తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టడంతో ఆమె కింద పడింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినది.
VSP: ఆన్ లైన్ లోన్ యాప్స్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఓ సూసైడ్ కేసు విచారణలో భాగంగా లోన్ యాప్లో అప్పు తీసుకుని సమయానికి కట్టకపోవడంతో ఫొటోలు మార్ఫింగ్ చేసి వారు వేధించడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. ఈ విషయంపై విశాఖ పోలీసులు నిందితుడుని కర్నూలులో అరెస్ట్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-2లో లిడ్ ఓపెన్ నుంచి మంటలు వ్యాపించడంతో నాగ శ్రీనివాసరావు అనే కార్మికుడు గాయాల పాలయ్యాడు. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి విభిన్న ప్రతిభా వంతులను గుర్తించాలని నరసన్నపేట జూనియర్ సివిల్ న్యాయాధికారి సీహెచ్. హరిప్రియ అన్నారు. ఉర్లం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: సోమవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐఎఫ్ డబ్ల్యూజే) నూతన డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకులు నెహ్రూ స్థాపించిన యూనియన్ ఇదే ప్రథమమన్నారు. ఈ కార్యక్రమంలో డోల అప్పన్న, తిత్తి ప్రవీణ్ కుమార్, బెహరా షణ్ముఖ, తదితరులు పాల్గొన్నారు.
AKP: పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో ఈనెల 17వ తేదీన జిల్లాస్థాయి కోలాటం పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామంలో జరిగే రామచంద్రమ్మ జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే కోలాట బృందాలు తమ పేర్లను ఈనెల 16వ తేదీ సాయంత్రంలోగా కమిటీ వద్ద నమోదు చేయించుకోవాలన్నారు.
VZM: పట్టణంలోని తోటపాలెం, వైఎస్ఆర్ కాలనీ నుండి ప్రదీప్ నగర్‌లో SBI బ్రాంచ్ వరకు 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పలువురు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను సులువుగా గుర్తించవచ్చన్నారు. అలాగే పట్టణంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.