• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విశాఖలో 66 మందికి పైగా బదిలీ

విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో అధికారుల బదిలీ అయ్యారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లోని వార్డెన్లను ఖైదీల ఎదుట దుస్తులు విప్పించి చెక్ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సుమారు 66 మందికిపైగా సిబ్బందిని బదిలీ చేసినట్లు ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు.

December 30, 2024 / 12:01 PM IST

పింఛన్ పంపిణీలో నాయకులు పాల్గొనాలి: కొమ్మలపాటి

PLD: డిసెంబర్ 31న జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెదకూరపాడు మండలంలోని నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు.

December 30, 2024 / 11:58 AM IST

కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.1లక్ష విరాళం

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి ప్రత్యేక చొరవతో ఆసుపత్రిలో అభివృద్ది పనులు సాగుతున్నాయి. కనిగిరికి చెందిన తమ్మినేని ప్రభాకర్ రెడ్డి, కందుల నారపరెడ్డి ఏడుకొండలు తదితరులు రూ.1లక్ష విరాళం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డికి అందజేశారు.

December 30, 2024 / 11:56 AM IST

‘ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించాలి’

BPT: కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించుకుని, ఆరోగ్యవంతమైన ఆరోగ్యం పొందాలని యూనిట్ ఇంచార్జి మన్నెం సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం కూరగాయల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిఆర్పిలు నందిని, తిరుపతమ్మ, స్యామేలు, భులక్షి, భారతి, రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

December 30, 2024 / 11:56 AM IST

డిజిటల్ అరెస్టుల పేరుతో ఫోన్ వస్తే భయపడవద్దు: సీఐ

NTR: కంచికచర్ల పట్టణ పరిధిలోని రూరల్ సీఐ చవాన్ తన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా మీకు ఫోన్ చేస్తే భయపడవద్దని సూచించారు. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. హర్ష సాయి ట్రస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు గుర్తించాలని తెలిపారు.

December 30, 2024 / 11:52 AM IST

పార్క్ గేటు తెరవాలని కాళ్లు, చేతులకు సంకెళ్ళతో నిరసన

KKD: సంక్రాంతికి స్వామి వివేకానంద పార్కు తూర్పుగేటు తెరవాలని కోరుతూ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద కాకినాడకు చెందిన సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కాళ్ళు చేతులకు సంకెళ్ళతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కు తూర్పు గేటు ప్రవేశ ద్వారం తెరిచేందుకు అధికారులు కుంటి సాకులు చెప్పడం దురదృష్టకరంగా ఉందని రమణ రాజు నిరసన వ్యక్తం చేశారు.

December 30, 2024 / 11:51 AM IST

పేకాట శిబిరం పై పోలీసులు దాడులు

ప్రకాశం: రాచర్ల మండలంలోని రాగిరెడ్డిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో రాచర్ల పోలీసులు పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.6,530 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలు, పేకాట లాంటి అసాంగిక చర్యలకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

December 30, 2024 / 11:49 AM IST

చెత్త పోగులతో నెలకొన్న అపరిశుభ్రత

కృష్ణా: నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాలలో చెత్త పోగులను మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది తొలగించకపోవడంతో అపరిశుభ్రత నెలకొంది. ఉదయం 11 గంటలు దాటినా చెత్తను ఎత్తకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పోగులను పందులు, కుక్కలు చెల్లా చెదురు చేస్తుండడంతో మరింత అపరిశుభ్రతగా ఉంటుందని, దీనివల్ల ఈగలు వ్యాప్తి చెందుతున్నాయని వాపోయారు.

December 30, 2024 / 11:45 AM IST

పోలీసుల అదుపులో సివిల్ సప్లయిస్ అధికారి?

కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. రేషన్ బియ్యం మాయం వెనుక కోటిరెడ్డి పాత్ర కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

December 30, 2024 / 11:41 AM IST

పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

కృష్ణా: ముసునూరులో సోమవారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ పిచ్చి కుక్క దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. గ్రామపంచాయతీలో ఇటీవల కుక్కల సమూహం ఎక్కువ కావడంతో ఏ రోడ్డు చూసినా కుక్కలు దర్శనమిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పిచ్చికుక్క దాడిలో ముసునూరు గ్రామానికి చెందిన ఆశావర్కర్ గాయపడింది.

December 30, 2024 / 11:39 AM IST

నిదానంపాటి అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

పల్నాడు: నరసరావుపేట పట్టణంలోని రావిపాడు రోడ్డులో సోమవారం జరిగిన నిదానంపాటి అమ్మవారి పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసాదాలు స్వీకరించారు. నూతన సంవత్సరం 2025లో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పూజా కార్యక్రమం నిర్వాహకులు అభినందించారు.

December 30, 2024 / 11:39 AM IST

‘అమీత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలి’

NTR: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తిరువూరులోని బోసుబొమ్మ సెంటర్లో సోమవారం సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, నాగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

December 30, 2024 / 11:36 AM IST

2024: ఉమ్మడి జిల్లా పొలిటికల్ పిక్చర్ ఛేంజ్

కృష్ణా: ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 16 నియోజకవర్గాల్లో 14 వైసీపీ, TDP 2 సీట్లలో గెలిచింది. ఈసారి 16 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. 2 ఎంపీ సీట్లతో పాటు 13 స్థానాల్లో TDP, ఒకటి జనసేన, 2 స్థానాల్లో బీజేపీ నెగ్గాయి. మంత్రులుగా కొల్లు రవీంద్ర, పార్థసారథి కొనసాగుతున్నారు.

December 30, 2024 / 11:31 AM IST

క్రీడల వల్ల శరీరం దృఢత్వం పెరుగుతుంది

NDL: నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, డిఎం గౌస్, కామిని బాలకృష్ణ హాజరయ్యారు. తులసి రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల వల్ల శరీరం దృఢత్వం పెరుగుతుందన్నారు. అప్పుడే మానసిక ధైర్యం ఆత్మస్థైర్యం అలవరుతుందన్నారు.

December 30, 2024 / 11:27 AM IST

‘అమిత్ షా వేంటనే రాజీనామా చేయాలి’

GNTR: పార్లమెంట్ సాక్షిగా బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రత్తిపాడు మండలంలోని బస్టాండ్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

December 30, 2024 / 11:23 AM IST