CTR: సత్యవేడు మండల పరిధిలోని అలిమేలు మంగాపురం గ్రామ సమీపంలో గల చెరువు వద్ద బ్యాటరీ స్కూటీ అగ్నికి ఆహుతైన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అలిమేలు మంగాపురం గ్రామానికి చెందిన దేవసుందరం అనే వ్యక్తి తిరుపతిలో సోమవారం తెల్లవారుజామున స్వగ్రామం నుంచి సత్యవేడుకు వెళ్లే క్రమంలో ఉన్నట్టుండి స్కూటీ నుంచి పొగలు వచ్చాయి. ఈ మంటల్లో స్కూటీ మొత్తం దగ్దమైంది.
కోనసీమ: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా గట్టి నిఘాచర్యలు చేపడుతున్నట్టు అమలాపురం రూరల్ సీఐ డి. ప్రశాంతకుమార్ సోమవారం తెలిపారు. ఉప్పలగుప్తం ఎస్సై చవల రాజేష్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ద్వారా జనసమూహంలో నేరాలకు పాల్పడే వారిని, కొబ్బరి తోటలలో అవాంఛనీయ కార్యక్రమాలు చేపట్టే వారిపై నిఘా పెట్టామన్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలం కలవటాల గ్రామ సమీపంలో ఉన్న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం నాడు రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ, ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ వారు తమ సమస్యలు పరిష్కరించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
E.G: కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై సోమవారం పోలీసులు దాడి చేశారు. ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ నేపథ్యంలో పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి గడువులోగా పరిష్కరిస్తామని చెప్పారు.
AKP: నర్సీపట్నం బాలల సత్వర చికిత్స కేంద్రం వద్ద సోమవారం వినికిడి పరీక్షలు నిర్వహించారు. వినికిడి సమస్యలతో బాధపడుతున్న పలువురు రోగులు భారీగా హాజరయ్యారు. ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మీ వరప్రసన్న రోగులను పరీక్షించి వినికిడి స్థాయిని నిర్ధారించారు. రోగులకు అవసరమైతే వినికిడి యంత్రాలను అందజేస్తామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రశాంతి తెలిపారు.
KRNL: జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ క్రమంలో ఎర్రబోతుల పాపిరెడ్డి న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
NLR: సోమశిల జలాశయాన్ని వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా సందర్శించారు. ఈ సందర్భంగా సీమ రాజాను టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఉదయగిరి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కోనసీమ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్లు కొత్తపేట నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రౌతు కాశి పేర్కొన్నారు. మన్మోహన్ పట్ల ఉన్న గౌరవంతో రాబోయే నూతన సంవత్సర 2025 వేడుకలను నిర్వహించడం లేదన్నారు. జనవరి 1న తనను కలవడానికి రావులపాలెంలోని తన కార్యలయంకు ఎవరు రావద్దని కోరారు.
కృష్ణా: పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలను మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. SP గంగాధర్ రావు స్వీయ పర్యవేక్షణలో దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి.
ATP: తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జేసీ పార్క్‌లో ఏర్పాట్లను ఆయన సోమవారం ఉదయం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణ ప్రజలు, పిల్లలతో మమేకమై పార్కులో సౌకర్యాల గురించి ఆరా తీశారు.
GNTR: బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్‌లో శిక్షణ పొందుతున్న పి.హాసిని జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అండర్-17, 19 రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపడంతో హాసిని జాతీయ పోటీలకు ఎంపికైంది.
W.G: ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సుమారు 25 ఎకరాల ఎండు గడ్డికి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే ఎండుగడ్డి అగ్నికి ఆహుతైంది. నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించి, రైతులకు ఆర్ధిన సహాయం చేయాలని కోరుతున్నారు.
GNTR: చేబ్రోలు బ్రహ్మదేవాలయం 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం బ్రహ్మదేవుడికి ఏకైక ఆలయం. బ్రహ్మదేవుడికి ఒక ఆలయం కాశీలో మరొకటి చేబ్రోలులో ఉంది. చేబ్రోలులోని దేవాలయాలు 2000వేల సంవత్సరాల నాటివి. చోళ, చాళుక్య, పల్లవ, కాకతీయ రాజవంశాలకు చెందినవి. ఈస్టర్ చాళుక్యుల సేనాధిపతి బయనంబిని ధరణికోట యనమదుల కోటలను జయించి చేబ్రోలును రాజధానిగా చేసుకొని పాలించారు.
VSP: గూడెంకొత్తవీధి మండలంలోని ఏబులం పంచాయతీ పరిధి కుమ్మరివీధికి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి నిర్మాణం కోసం అధికారులకు పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులంతా చందాలు వేసుకొని జేసీబీ సహాయంతో సొంతంగా రహదారి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని కోరారు.