• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నంలో వినికిడి పరీక్షలు

AKP: నర్సీపట్నం బాలల సత్వర చికిత్స కేంద్రం వద్ద సోమవారం వినికిడి పరీక్షలు నిర్వహించారు. వినికిడి సమస్యలతో బాధపడుతున్న పలువురు రోగులు భారీగా హాజరయ్యారు. ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మీ వరప్రసన్న రోగులను పరీక్షించి వినికిడి స్థాయిని నిర్ధారించారు. రోగులకు అవసరమైతే వినికిడి యంత్రాలను అందజేస్తామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రశాంతి తెలిపారు.

December 30, 2024 / 10:47 AM IST

న్యూ ఇయర్ వేడుకలకు జడ్పీ ఛైర్మన్ దూరం

KRNL: జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ క్రమంలో ఎర్రబోతుల పాపిరెడ్డి న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

December 30, 2024 / 10:35 AM IST

సోమశిల జలాశయం సందర్శన: సీమరాజా

NLR: సోమశిల జలాశయాన్ని వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా సందర్శించారు. ఈ సందర్భంగా సీమ రాజాను టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఉదయగిరి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

December 30, 2024 / 10:33 AM IST

నూతన సంవత్సర వేడుకలకు కాంగ్రెస్ ఇంచార్జ్ దూరం

కోనసీమ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్లు కొత్తపేట నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రౌతు కాశి పేర్కొన్నారు. మన్మోహన్ పట్ల ఉన్న గౌరవంతో రాబోయే నూతన సంవత్సర 2025 వేడుకలను నిర్వహించడం లేదన్నారు. జనవరి 1న తనను కలవడానికి రావులపాలెంలోని తన కార్యలయంకు ఎవరు రావద్దని కోరారు.

December 30, 2024 / 10:29 AM IST

దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం

కృష్ణా: పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలను మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. SP గంగాధర్ రావు స్వీయ పర్యవేక్షణలో దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి.

December 30, 2024 / 10:28 AM IST

తాడిపత్రిలో న్యూఇయర్ వేడుకల ఏర్పాట్ల పరిశీలన

ATP: తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జేసీ పార్క్‌లో ఏర్పాట్లను ఆయన సోమవారం ఉదయం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణ ప్రజలు, పిల్లలతో మమేకమై పార్కులో సౌకర్యాల గురించి ఆరా తీశారు.

December 30, 2024 / 10:26 AM IST

టెన్నిస్ క్రీడాకారిణికి కమిషనర్ అభినందన

GNTR: బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్‌లో శిక్షణ పొందుతున్న పి.హాసిని జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అండర్-17, 19 రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపడంతో హాసిని జాతీయ పోటీలకు ఎంపికైంది.

December 30, 2024 / 10:21 AM IST

ఎండు గడ్డికి నిప్పు పెట్టిన దుండగులు

W.G: ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సుమారు 25 ఎకరాల ఎండు గడ్డికి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే ఎండుగడ్డి అగ్నికి ఆహుతైంది. నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించి, రైతులకు ఆర్ధిన సహాయం చేయాలని కోరుతున్నారు.

December 30, 2024 / 10:18 AM IST

20వ శతాబ్దపు ఆలయం గురుంచి మీకు తెలుసా.?

GNTR: చేబ్రోలు బ్రహ్మదేవాలయం 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం బ్రహ్మదేవుడికి ఏకైక ఆలయం. బ్రహ్మదేవుడికి ఒక ఆలయం కాశీలో మరొకటి చేబ్రోలులో ఉంది. చేబ్రోలులోని దేవాలయాలు 2000వేల సంవత్సరాల నాటివి. చోళ, చాళుక్య, పల్లవ, కాకతీయ రాజవంశాలకు చెందినవి. ఈస్టర్ చాళుక్యుల సేనాధిపతి బయనంబిని ధరణికోట యనమదుల కోటలను జయించి చేబ్రోలును రాజధానిగా చేసుకొని పాలించారు.

December 30, 2024 / 10:17 AM IST

చందాలు వేసుకుని రహదారి నిర్మాణం చేపట్టారు

VSP: గూడెంకొత్తవీధి మండలంలోని ఏబులం పంచాయతీ పరిధి కుమ్మరివీధికి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి నిర్మాణం కోసం అధికారులకు పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులంతా చందాలు వేసుకొని జేసీబీ సహాయంతో సొంతంగా రహదారి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని కోరారు.

December 30, 2024 / 10:16 AM IST

ఈ రోడ్డుపై నడిచేదెలా…..?

ప్రకాశం: పామూరు నుండి కందుకూరు వెళ్ళే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వాన్నంగా తయారైంది. ముఖ్యంగా పామూరులో రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడి, అంచుల్లో వర్షపు నీరు చేరడం వల్ల రాకపోకలు సాగించే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు రోడ్డు మరమ్మత్తులు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

December 30, 2024 / 10:16 AM IST

కడప దర్గాపై దుష్ప్రచారం.. జిల్లా వ్యక్తులు అరెస్ట్

ATP: ప్రసిద్ధి చెందిన కడప పెద్ద దర్గాపై దుష్ప్రచారం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు కడప టూ టౌన్ సీఐ నాగార్జున తెలిపారు. అనంతపురం నగరానికి చెందిన షకిల్ షఫీ, నూర్ బాబా, బాజీలు ఇటీవల దర్గాపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో దర్గా మేనేజర్ అలీ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.

December 30, 2024 / 10:15 AM IST

త్వరలో మెట్రో పనులు ప్రారంభం: ఎంపీ చిన్ని

కృష్ణా: విజయవాడ ఆటోనగర్, మురళీనగర్ నుంచి బల్లెంవారి వీధి వరకు ఉన్న రోడ్లను సోమవారం MLA గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ, ML కేశినేని చిన్ని పరిశీలించారు. త్వరలో ప్రారంభం కానున్న మెట్రో ఏలూరు రోడ్డు ఫ్లైఓవర్ పనుల వల్ల ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.

December 30, 2024 / 10:13 AM IST

గుత్తి పురపాలక పింఛన్‌దారులకు శుభవార్త

ATP: గుత్తి పురపాలక పింఛన్‌దారులకు జనవరి 1వ తేదీ పంపిణీ చేసే పింఛన్‌లను డిసెంబర్ 31వ తేదీ ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సోమవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నూతన సంవత్సరం సందర్భంగా పింఛన్‌లను ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నామన్నారు.

December 30, 2024 / 10:03 AM IST

గోపాలపురంలో ఏటీఎం ధ్వంసం

W.G: గోపాలపురంలోని ఆదివారం అర్ధరాత్రి SBI ఏటీఎంను గుర్తు తెలియని దుండగలు ధ్వంసం చేశారు. ఎవరూ లేని సమయంలో రాయితో ఏటీఎం ధ్వంసానికి పాల్పడ్డారు. వెంటనే సైరన్ మోగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆగి మందలించే క్రమంలో దుండగులు పరారయ్యారు. స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 30, 2024 / 10:01 AM IST