VZM: పశ్చిమాసియాలో యుద్ధం సమసిపోయి, ప్రపంచంలో శాంతి నెలకొనాలని అంకాంక్షిస్తూ ముస్లిం సోదరులు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 30 రోజులు పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు శనివారం నెలవంక ఉషోదయంతో దీక్షను విరమించి రంజాన్ పండగను ఘనంగా జరుపుకొన్నారు. RTC కాంప్లెక్స్ సమీపంలో గల అతి పెద్ద ఈద్గాల్లో అందరూ కలిసి సామూహిక ప్రార్థనలు చేశారు.