CTR: గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఓ జేసీబీ ఢీ కొట్టిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు SI రామ్మోహన్ తెలిపారు. నగరికి చెందిన రుశేంద్రబాబు (35)తన భార్య, కుమారుడు (5)తో కలిసి ఆటోలో వస్తుండగా అతివేగంగా వచ్చిన జేసీబీ ఢీ కొట్టింది. స్థానికులు క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
EG: పెరవలి-నరసాపురం రోడ్డు పునరుద్ధరణ పనులను ఆర్ అండి బి అధికారులు ముమ్మరంగా చేపడుతున్నారు. నెగ్గిపూడి వద్ద కల్వర్టు నిర్మాణం, పెనుగొండ బ్రిడ్జి మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో పెరవలి నుంచి వెళ్ళే వాహనాలు దారి మళ్లించారు. కాపవరం, పెనుగొండ, వడలి, సిద్ధాంతం వయా ఆచంట, మార్టేరు మీదుగా నర్సాపురం వెళ్లాలని బోర్డులు అమర్చారు.
KDP: ఆంధ్ర భద్రాద్రిగా వెలసిన ఒంటిమిట్ట కోదండ రామాలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రీవారి సేవకులు, శుక్రవారం లెక్కించారు. గత నెల 21 నుంచి నిన్నటి వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 27, 69,135 ఆదాయం వచ్చిందని ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. గత 9 ఏళ్ల తర్వాత అత్యధిక హుండీ ఆదాయం వచ్చిందన్నారు.
KDP: కలసపాడు మండలంలోని ముదిరెడ్డిపల్లిలో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీశ్ రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి నూతన బోరు వేసి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండాకాలం సంభవిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు.
BPT: చీరాల ఎన్ఆర్&ఎంపీ స్కూల్లో రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ శుక్రవారం ఫ్లడ్ లైట్ల వెలుగులో హోరాహోరీగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 20 ఫుట్‌బాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు.
PLD: నరసరావుపేటలోని ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పాత మాగులూరుకి చెందిన గోపి బుక్కాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోపి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోను వదిలి డ్రైవర్ పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని ఆసుపత్రి పాలెంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పలు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కాలనీలో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
CTR: గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఓ జేసీబీ ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు SI రామ్మోహన్ తెలిపారు. నగరికి చెందిన రుశేంద్ర బాబు తన భార్య, కుమారుడు (5)తో కలిసి ఆటోలో వస్తుండగా అతి వేగంగా వచ్చిన జేసీబీ ఢీకొట్టింది. స్థానికులు క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.
ATP: గుత్తిలోని 626 సర్వేనెంబర్లో గల వక్ఫ్ బోర్డ్ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం టిప్పు సుల్తాన్ ఇత్తహాదుల్ ముస్లింమీన్ కమిటీ ఆధ్వర్యంలో గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీఆర్ ఖలీల్ మాట్లాడుతూ.. వక్ఫ్ స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలన్నారు.
ATP: తాడిపత్రికి చెందిన 12ఏళ్ల బాలిక వర్ణిక నిజాయితీ చాటుకున్నారు. పట్టణంలోని మెయిన్ బజార్ యూనియన్ బ్యాంక్ ATM వద్ద భాస్కర్ నాయక్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేశారు. ఆ సమయంలో డబ్బులు రాకపోవడంతో వెళ్లిపోయాడు. పది నిమిషాల తర్వాత అదే ఏటీఎంలోకి వెళ్లిన వర్ణిక 9వేలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నగదును CI సాయి ప్రసాద్‌కు అందజేశారు.
TPT: తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ జాతర ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లను నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, మేయర్ శిరీష శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణా: నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద క్షిపణి పరీక్ష కేంద్రంలోని పలు పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన వాటిలో మొట్టమొదటిది కృష్ణా జిల్లాలోని గుల్లలమోద వద్ద క్షిపణి పరీక్ష కేంద్రం కావడం విశేషం. ఇది కృష్ణా జిల్లాకు మణిహారంగా మారునుంది. ఎట్టికేలకు ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడింది.
NLR: అనంతసాగరం ICDS ప్రాజెక్ట్‌లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ పోస్టులను అదే సెంటర్లో పని చేస్తున్న హెల్పర్స్లకు ఇవ్వాలని CITU ఆధ్వర్యంలో సీడీపీవో పద్మావతికి శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతసాగరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని మూడు వర్కర్ పోస్టులను, అదే సెంటర్లలో వర్కర్లుగా పూర్తి అర్హతలు కలిగి ఉన్న హెల్పర్లకు ఇవ్వాలన్నారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెంకు చెందిన YCP నాయకుడు లక్ష్మీనారాయణ కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KDP: ప్రధాని నరేంద్ర మోదీ కడప ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలోని అంబేద్కర్ సర్కిల్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ ఎంతో అవసరం అన్నారు. ఇక్కడ యువత ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.